మళ్లీ ఫొటో పెట్టిన షమీ! | Mohammed Shami in the line of fire once again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫొటో పెట్టిన షమీ!

Published Mon, Jan 2 2017 8:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

మళ్లీ ఫొటో పెట్టిన షమీ!

మళ్లీ ఫొటో పెట్టిన షమీ!

న్యూఢిల్లీ: తన భార్య వస్త్రధారణపై వివాదం చెలరేగినప్పటికీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వెనక్కు తగ్గడం లేదు. తన భార్యతో కలిసివున్న ఫొటోను తాజాగా ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు భార్యపై తనకు అంతులేని ప్రేమ ఉందని పేర్కొన్నాడు. ‘నిన్ను చూసినప్పుడు నాకో అందమైన తోడు దొరికిందని గట్టిగా చెప్పగలను.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

డిసెంబర్‌ 23న తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షమీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా.. దానిపై కొందరు విద్వేషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో షమీ భార్య హసిన్‌ జహాన్‌ స్లీవ్‌లెస్‌ గౌను వేసుకోగా.. కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. ఈ విషయంలో తన భార్య, కూతురికి షమీ అండగా నిలిచాడు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు.

కాగా, 2017 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించాడు. తన స్నేహితులందరూ శాంతిసౌఖ్యలతో సంతృప్తికర జీవితం గడపాలని కోరుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement