పిడుగుపాటుకు గాయపడ్డ రైతు
పెనుకొండ రూరల్ : పెనుకొండ మండలం సత్తారుపల్లిలో శంకరరెడ్డి అనే రైతు పిడుగుపాటుకు గురై శనివారం గాయపడ్డారని బంధువులు తెలిపారు. స్వగ్రామం నుంచి మావటూరుకు బైక్‌లో వెళ్తుండగా మధ్యలో వర్షం మొదలైందన్నారు. దీంతో చెట్టు కింద బైక్‌ను ఆపి నిలబడి ఉండగా కొంత దూరంలోనే పిడుగు పడిందని చెప్పారు. దీంతో అతను షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యుల సహకారంతో సర్పంచ్ సుధాకరరెడ్డి తన కారులో శంకర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ హసీ నా సుల్తానా, ఎంపీడీఓ శివానందనాయక్ గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు.