బోయింగ్ 777కు బాంబు బెదిరింపు
టర్కీ: టర్కీకి చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి కాకుండా మరో చోటకు తరలించి దించివేశారు. టర్కీకి చెందిన టర్కీష్ ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 777 హ్యూస్టన్ నుంచి ఇస్తాంబుల్‌కు బయలు దేరింది.
మధ్యలో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో ఐర్లాండ్ వైమానిక సంస్థ అధికారుల అనుమతి తీసుకుని ఇస్తాంబుల్ వైపు వెళ్లకుండా ఐర్లాండ్ లో పైలెట్ సురక్షితంగా దించి వేశాడు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం దించినవెంటనే వారందరినీ షానాన్ ఎయిర్ పోర్ట్ లోని సురక్షిత స్థావరానికి తరలించి విమాన తనిఖీ ప్రారంభించారు.