బ్రహ్మకుమారీస్ బాటలోనే ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ఆధ్యాతి్మక చింతనతోపాటు సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను తొలగించేందుకు ‘బ్రహ్మకుమారీస్’సంస్థ చేస్తున్న కృషి ఆనుసరణీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బ్రహ్మకుమారీస్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్ గచి్చ»ౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శాంతిసరోవర్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ ఫ్రీ సొసైటీ, రైతులకు లాభసాటి వ్యవసాయం, దివ్యాంగులకు చేయూత, యువతకు ఉపాధికి సంబంధించిన నాలుగు సామాజిక ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ శాంతి సరోవర్ హైదరాబాద్‌లో ఉండటం భాగ్యనగర కీర్తిని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు. నేటి యువతరాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి సహా ఇతర చెడు అలవాట్లను తొలగించి వారిలో నూతనోత్తేజాన్ని నింపి దేశం కోసం ఉపయోగపడేలా బ్రహ్మకుమారీస్ సంస్థ కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపన కోసం సైతం ఈ సంస్థ కృషి చేస్తోందని కొనియాడారు. డ్రగ్స్‌రహిత తెలంగాణ కోసం ప్రయతి్నస్తున్నాంతెలంగాణలో డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడే లా డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్స్ టీమ్‌ను ఏర్పా టు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. దేశంలోనే రూ. 31 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేసి తమది రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు సీఎం వివరించారు. ముచ్చెర్లలో అభివృద్ధి చేసే ఫ్యూచర్ సిటీలోనే ఈ వర్సిటీ ఉంటుందన్నారు. శాంతి సరోవర్ లీజును పునరుద్ధరిస్తాం తెలంగాణ ప్రభుత్వానికి బ్రహ్మకుమారీస్ మార్గదర్శులని.. హైదరాబాద్‌లోని శాంతి సరోవర్కు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ చెప్పారు. శాంతి సరోవర్ లీజు గడువు ముగియనున్నందున పునరుద్ధరించి వారికి అన్నివిధాలా సహకరిస్తామని ప్రకటించారు. మౌంట్ అబూ తర్వాత తెలంగాణ లో శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని చెడును తొలగించడానికి బ్రహ్మకుమారీస్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆధ్యాతి్మక రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో బ్రహ్మకుమారీస్ సంస్థ తోడ్పడుతోందన్నారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మృత్యుంజయ (మౌంట్ అబూ), కుల్దీప్ దీదీ, సంతోష్ దీదీ, మంజు, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.