sharbati devi
-
ప్రధాని రాఖీ సోదరి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాఖీ సిస్టర్ షర్బతీ దేవి (104) కన్ను మూశారు. శనివారం ధన్బాద్లో ఆమె తుది శ్వాస విడిచారని బంధువులు తెలిపారు. గత సంవత్సరం ప్రధాని మోదీకి రాఖీ కట్టాలని ఉందంటూ లేఖ రాసి వార్తల్లో నిలిచారు షర్బతీ దేవి. 50 ఏళ్ళ క్రితం సోదరుడిని కోల్పోయిన తాను మోదీకి రాఖీ కట్టాలనే కోరికను వ్యక్తపరుస్తూ కుమారుడు ద్వారా ప్రధానికి లేఖ రాశారు. దీనికి మోదీ ఆమోదం తెలపడంతో రాఖీ పర్వదినాన లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో మెదీకి రాఖీ కట్టిన షర్బతీ దేవి అత్యంత ఆనందానికి లోనైన సంగతి తెలిసిందే. కాగా షర్బతీ దేవీకి తొమ్మండుగురు సంతానం. గతంలోనే భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తులు ఉన్నారు. రేపు (ఆదివారం , మార్చి 11వ తేదీ) అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు వెల్లడించారు. -
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి
న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.103 ఏళ్ల బామ్మ షర్బతి దేవి సోమవారం మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. బామ్మతో రాఖీ కట్టించుకున్న ప్రధాని... ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. వీల్ చెయిర్‌కు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆమెతో ముచ్చటించారు. Smt. Sharbati Devi, a 103 year old widow, today visited the PM's residence, and tied a Rakhi on PM @narendramodi's wrist. pic.twitter.com/IwRq1QiBhj — PMO India (@PMOIndia) 7 August 2017 50ఏళ్ల క్రితమే తన సోదరుడిని కోల్పోయిన షర్బతి దేవి ప్రధానిలో తన సోదరుడిని చూసుకుని మురిసిపోయింది. అంతేకాకుండా ప్రధానిని చేతులతో నిమిరి, ఆశీర్వదించారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయం ట్విట్ చేసింది. మరోవైపు పలువురు స్కూల్ విద్యార్థినులు ప్రధానికి రాఖీ కట్టారు.