ప్రధాని రాఖీ సోదరి కన్నుమూత | PM Narendra Modi Rakhi Sisiter Sharbati Devi Passed away | Sakshi
Sakshi News home page

ప్రధాని రాఖీ సోదరి కన్నుమూత

Published Sat, Mar 10 2018 3:09 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra  Modi Rakhi Sisiter  Sharbati Devi  Passed away - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ  రాఖీ సిస్టర్‌ షర్బతీ దేవి (104) కన్ను మూశారు.  శనివారం ధన్‌బాద్‌లో ఆమె  తుది శ్వాస విడిచారని బంధువులు  తెలిపారు. గత సంవత్సరం ప్రధాని మోదీకి  రాఖీ కట్టాలని ఉందంటూ లేఖ రాసి వార్తల్లో  నిలిచారు  షర్బతీ దేవి.  50 ఏళ్ళ క్రితం సోదరుడిని కోల్పోయిన తాను మోదీకి రాఖీ కట్టాలనే కోరికను వ్యక్తపరుస్తూ  కుమారుడు ద్వారా ప్రధానికి లేఖ  రాశారు.    దీనికి మోదీ ఆమోదం తెలపడంతో  రాఖీ పర్వదినాన లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని   ప్రధాని నివాసంలో మెదీకి  రాఖీ కట్టిన  షర్బతీ దేవి అత్యంత ఆనందానికి లోనైన సంగతి  తెలిసిందే.

కాగా షర్బతీ దేవీకి తొమ‍్మండుగురు సంతానం. గతంలోనే భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు.  నలుగురు కుమారులు,  ముగ్గురు కుమార్తులు ఉన్నారు. రేపు (ఆదివారం , మార్చి 11వ తేదీ) అంత్యక్రియలు  నిర్వహించనున్నామని బంధువులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement