షర్మిల పాల్గొన్న సభా ప్రాంతంలో విద్యుత్ కట్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాల్గొన్న సమైక్య శంఖారావం బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్‌ను నిలిపివేశారు. సభ జరిగే ప్రదేశానికి కొద్ది దూరంలోనే విద్యుత్ సరఫరా ఉంది. సభ జరిగే సమయంలో విద్యుత్‌ను నిలిపివేయడం పట్ల హాజరైన జనం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ లేకపోయినా భారీగా తరలి వచ్చిన జనం ఆ చీకట్లోనే షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
సమైక్య శంఖారావం బహిరంగ సభకు హాజరైన జనంతో తిరుపతి లీలామహాల్ సెంటర్ జన సముద్రమైంది. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు కలిగించినా ఈ జన ప్రవాహాన్ని ఎవరు అడ్డుకోగలరు? అని వారు ప్రశ్నించారు.
అయితే విద్యుత్ ఉద్యోగులు బంద్‌లో భాగంగా విద్యుత్‌ను నిలిపివేశారా? లేక కావాలనే తీసివేశారా? అనేది తెలియవలసి ఉంది.