Shashank Vennelakanti
-
విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'లింగ' వివాదానికి ఇంతటితో తెర దించండి
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రంలో ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై దర్శక, నిర్మాతలు, రచయిత స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. ఆ సన్నివేశాలను, సంభాషణలనూ చిత్రం నుంచి తొలగించారు. నిర్మాత 'రాక్‌లైన్' వెంకటేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అన్నివర్గాల ప్రేక్షకులు సినిమాకు ముఖ్యులేనని, సినిమా ద్వారా సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, అయితే పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని 'లింగ' చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించిన రచయిత శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన చేశారు. పెద్ద మనసుతో 'లింగ' చిత్రంపై వివాదానికి ఇంతటితో తెర దించాల్సిందిగా అన్ని వర్గాలనూ శశాంక్ ఈ సందర్భంగా అభ్యర్తించారు.