Shathrugna sinha
-
ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు
పట్నా: ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీపడుతుండడంతో బిహార్‌లోని పట్నా సాహీబ్ లోక్‌సభ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఇటీవల బీజేపీని వీడి.. ఈసారి కాంగ్రెస్‌లో చేరి మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ పోటీలో నిలిపింది. స్థానికంగా ఇద్దరూ బలమైన నేతలు కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. అధికార పార్టీలోనే ఉంటూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సిన్హాను ఓడించాలనే వ్యూహంతోనే బీజేపీ అధిష్టానం రవిశంకర్ ప్రసాద్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మరోవైపు తనకు టికెట్ నిరాకరించిన బీజేపీని పట్నా సాహీబ్‌లో ఎలానైనా ఓడించి తీరుతానని షాట్‌గన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా బిహార్‌లో స్థానికంగా బలమైన కాయస్థా వర్గానికి చెందిన నేతలే. ఈనియోజకవర్గంలో 48శాతం అగ్రవర్గాలకు చెందిన ఓట్లు కీలకం కానునున్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 23శాతం ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఈసారి జేడీయూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే దళిత, మైనార్టీ, బీసీ ఓట్లపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. -
వాళ్లతో ఎందుకు పని చేయకూడదు?
‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల బాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్, ముఖేష్ చాబ్రాలు ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమం గురించి తాజాగా సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా స్పందించారు. ‘‘నా 40 ఏళ్ల కెరీర్లో ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళతోనూ చాలా మర్యాదతో నడుచుకుంటున్నాను’’ అన్నారు. మరి.. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ ఘాయ్‌తో కలిసి మీరు పని చేస్తారా? అంటే.. ‘‘ఎందుకు పని చేయకూడదు. అతను ఇప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. అతను దోషిగా తేలినప్పటికీ కలిసి పని చేస్తాను. ఎందుకంటే... అతని తప్పు నిరూపితమైతే ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అయినా.. సంజయ్ దత్ దోషిగా తేలి జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా?. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయమని కొందరు అంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో వాళ్లు హీరోలుగా హైలైట్ కావడానికి అలా మాట్లాడుతున్నారేమో?’’ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్ ఖాన్‌తో(హౌస్‌ఫుల్ 4) వర్క్ చేయనని అక్షయ్ కుమార్, ‘మొఘల్’ సినిమాలో సుభాష్ కపూర్‌తో పని చేయనని ఆమిర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. -
బీజేపీ అసమ్మతి నేతలతో మమత మంతనాలు
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె తాజాగా బీజేపీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారంబీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సింగ్, శత్రుఘ్నసిన్హా, అరుణ్ శౌరీలతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మూడో ఫ్రంట్ అవసరాన్ని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వారితో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శరద్‌పవార్, శివసేన పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయిన మమతా నేడు బీజేపీ తిరుగుబాటు నాయకులతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తృతీయ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆమె దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ'
ముంబై: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ కోల్పోతోందని ఆ పార్టీ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు. సంస్థాగత వ్యవహారాల్లో అద్వానీని సంప్రదించాలని, ముఖ్యమైన అంశాలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఆయనను విశ్వాసంలోకి తీసుకొని చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ స్వీకరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు మీడియాతో అన్నారు. ప్రస్తుతం తాము గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, కాని వాటిని అధిగమిస్తామనే నమ్మకముందని చెప్పారు. ప్రజలు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు. తాను బిహార్ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని సిన్హా స్పష్టం చేశారు. తాను మోదీకిగాని, ఇంకా ఎవరికిగాని మద్దతుదారుడిని కానని, కేవలం బిహార్ మద్దతుదారునని చెప్పారు.