న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె తాజాగా బీజేపీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారంబీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సింగ్, శత్రుఘ్నసిన్హా, అరుణ్ శౌరీలతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మూడో ఫ్రంట్ అవసరాన్ని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వారితో చర్చించినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే శరద్‌పవార్, శివసేన పార్టీ నాయకులు, టీఆర్‌ఎస్ ఎంపీలతో భేటీ అయిన మమతా నేడు బీజేపీ తిరుగుబాటు నాయకులతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తృతీయ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆమె దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment