షాన్ మార్ష్ స్థానంలో ఆమ్లా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి వెన్నునొప్పి కారణంగా వైదొలిగిన కింగ్స్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ స్థానంలో హషీమ్ ఆమ్లాకు చోటు కల్పించారు. షాన్ మార్ష్ కు ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఆమ్లాను జట్టులోకి తీసుకుంటున్నట్లు కింగ్స్ పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది.
త్వరలోనే ఆమ్లా జట్టుతో కలవనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ఆమ్లాను ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. ఆమ్లా కనీస ధర కోటి రూపాయిలున్నా అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన ఆమ్లా టీ 20 రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. ఇప్పటివరకూ 88 టీ 20లు ఆడిన ఆమ్లా 2,446 పరుగులు సాధించాడు. టీ 20ల్లో అతని సగటు 31. 35గా ఉండగా, స్ట్రైక్ రేట్ 125. 95 గా ఉంది.