మొక్కలు నాటి.. మరచిపోవద్దు
ఎంపీ కవిత
గచ్చిబౌలి: మొక్కలు నాటి... మరచిపోవద్దని... ఆరు నెలలు వాటిని కాపాడితే.. ఆ తరువాత అవి మనల్ని కాపాడతాయని ఎంపీ కవిత అన్నారు. సమాజంలోని కలుపు మొక్కలను ఏరివేసే షీ టీమ్స్ మొక్కలు నాటడం శుభ పరిణామమని ప్రశంసించారు. శుక్రవారం గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలంలో సైబరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ‘మహిళ హరితహారం’ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ కవిత మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి మహిళ హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా భావిస్తోందన్నారు.
నగరంలో పచ్చదనం, ఆహ్లాదం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రవుంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ భరణి, మాదాపూర్ డీసీపీ కార్తికేయ, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, షేక్ హమీద్ పటేల్, అడిషనల్ డీసీపీ సలీమ, ఏసీపీ రమణకుమార్, సీఐలు సునీత, జూపల్లి రమేశ్, నర్సింగరావు, దుర్గాప్రసాద్, వెస్ట్ జోన్ లెసైన్స్ ఆఫీసర్ రవికుమార్, ఉప వైధ్యాధికారి రవికుమార్, నందుసింద్, తదితరులు పాల్గొన్నారు.