Sheikh Hasinas son
-
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
చిక్కుల్లో మాజీ ప్రధాని
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలిదా జియా(70) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఢాకా కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ప్రధాని షేక్ హసినా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ పై చేసిన ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేశారు. ఈ నెల 1న ఢాకాలో జరిగిన ర్యాలీలో జియా ప్రసంగిస్తూ... వాజెద్ అక్రమంగా 300 మిలియన్ డాలర్లు బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. జియా చేసిన ఆరోపణలు వాజెద్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రొ-అవామి లీగ్ జననేత్రి పరిషత్ అధ్యక్షుడు ఏబీ సిద్ధిఖీ ఢాకా కోర్టులో పరువునష్టం దావా వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరపాలని పోలీసులను ఆదేశించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.