టంగుటూరు వాసికి శిల్పగురు అవార్డు
బనగానపల్లె: మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన కాచిరెడ్డి శివప్రసాదరెడ్డి గీసిన కలంకారి చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు లభించింది. 2015 జాతీయ పురస్కారాలు, హస్త కళాకారులకు ఎంపిక సందర్భంగా దేశంలోనే 8 మంది చిత్రకారులు గీసిన కలంకారి చిత్రాలను ఎంపిక చేశారు. ఇందులో తాను గీసిన విలేజ్ వీవర్స్ కలంకారి చిత్రం కూడా ఉన్నట్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 వతేది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంస పత్రం, మెమోంటోతో పాటు రూ.2లక్షల నగదు అందుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టెక్స్టైల్ మినిస్టర్ స్కృతి ఇరాని, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీ క్రాఫ్ట్ ఇతర ముఖ్య అతి«థులు పాల్గొన్నట్లు తెలిపారు.