మరణం అంచున ఐసిస్ టాప్ కమాండర్
బీరుట్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రసంస్థ అగ్రనేతల్లో ఒకరైన కమాండర్ ఒమర్ అల్ షీషానీ అమెరికా వైమానిక దాడిలో గాయపడ్డారు. ఆయన రఖా సిటీలోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శ్వాస తీసుకుంటున్నారని సిరియాలో మానవహక్కుల పర్యవేక్షణ సంస్థ ప్రధాన అధికారి రమీ అబ్దుల్ రహ్మాన్ ఆదివారం మీడియాతో చెప్పారు.
మార్చి 4న షదాది సిటీ లో ఒమర్ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జరి పిన దాడిలో ఒమర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మరణించారని రహ్మాన్ వెల్లడించారు.