shivakumara swamiji
-
శివకుమార స్వామికి కడసారి వీడ్కోలు..
-
శివకుమార స్వామికి కన్నీటి వీడ్కోలు
తుమకూరు: కన్నడనాట ఆధ్యాత్మిక, విద్యా ప్రదాత తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్ శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు మంగళవారం భక్తుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. 111 ఏళ్ల స్వామి సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత సుమారు లక్ష రుద్రాక్షలతో నిర్మించిన పల్లకిలో 400 మీటర్ల దూరంలోని సమాధి ప్రదేశం వరకు ఊరేగింపుగా తెచ్చారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, కేంద్రమంత్రులు సదానందగౌడ, నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని దేవెగౌడ, పలువురు మాజీ సీఎంలు, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. ప్రధాని మోదీ వారణాసిలో మాట్లాడుతూ శివకుమార స్వామి దగ్గరకు తాను ఎప్పుడు వెళ్లినా తనను కొడుకులా భావించి ప్రేమను కురిపించి ఆశీర్వదించే వారనీ, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందని అన్నారు. వీరశైవ లింగాయత్ సంప్రదాయంలో... వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం శివకుమార స్వామి అంత్యక్రియలు జరిగాయి. కొత్త కాషాయ వస్త్రాలను ముందుగా స్వామి పార్థివ దేహానికి తొడిగి, అనంతరం కూర్చున్న భంగిమలో ఉంచి దేహంపై త్రివర్ణపతాకాన్ని కప్పారు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. గతంలోనే స్వామి సూచించిన భవనంలో సమాధిని తవ్వి ఉంచారు. శివకుమార స్వామి పార్థివ దేహాన్ని క్రియా సమాధిలో ఉంచి రాష్ట్రంలోని నదుల నుంచి తెచ్చిన పుణ్య జలాలతో అభిషేకించారు. ఆ తర్వాత రెండు క్వింటాళ్ల విభూతి, 900 కేజీల ఉప్పు, బిల్వ పత్రాలు సమాధిలో ఉంచారు. ఆ తర్వాత పద్మాసనంలో స్వామిజీని కూర్చొబెట్టి ఖననం చేశారు. -
శివకుమార స్వామి శివైక్యం
సాక్షి, బెంగళూరు: కన్నడనాట మహారుషి, అభినవ బసవణ్ణగా పేరుపొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి, పద్మభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్ శ్రీ శివకుమార స్వామి శివైక్యం చెందారు. వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన 111 ఏళ్ల స్వామీజీ కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం 11.44 గంటలకు మఠంలోనే స్వామి కన్నుమూశారు. శివకుమారస్వామి అస్తమయంతో కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోని అశేష భక్తజనం శోకసంద్రంలో మునిగిపోయారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో సహా పెద్దసంఖ్యలో మంత్రులు, శాసనసభ్యులు, ప్రముఖులు తుమకూరు మఠానికి తరలివచ్చారు. వేలాదిమంది భక్తులు స్వామీజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నడిచే దైవంగా గుర్తింపు.. శివకుమార స్వామి తన జీవితకాలంలో ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1908 ఏప్రిల్ 1న బెంగళూరుకు సమీపంలోని మాగడి తాలూకా వీరాపుర గ్రామంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా శివకుమార స్వామి జన్మించారు. 1930 నుంచి ఇప్పటివరకు 9 దశాబ్దాల పాటు సిద్ధగంగా మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అన్నదానం, విద్యాదానం, ఆశ్రయం కల్పించి లక్షలాది మందిని ఆదుకున్నారు. కులమతాల వివక్ష లేకుండా లక్షల మంది ఆకలి తీర్చి, జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే ఆయనకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని నడిచే దైవమని నమ్ముతారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, మాజీప్రధాని వాజ్‌పేయి, కాంగ్రెస్ ప్రముఖులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ సహా ఎందరెందరో అత్యంత ప్రముఖులు, ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడో ఒకప్పడు స్వామిని కలిసి పాదాభివందనాలు చేసినవారే. మఠంలోనే కన్నుమూత శివ కుమారస్వామి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చెన్నై, తుమకూరు, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. అయితే స్వామీజీ కోరిక మేరకు గత గురువారం మఠానికే తరలించి ఆయనకు అక్కడే చికిత్సను అందిస్తున్నారు. సోమవారం పరిస్థితి విషమించి స్వామి కన్ను మూశారనీ సిద్ధగంగ మఠం ప్రకటించింది. సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప, ఇతరత్రా రాజకీయ, సినీ ప్రముఖులు మఠానికి చేరుకుని నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మఠంలోనే వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయి. స్వామి మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. విద్యాదాతగా ఎనలేని గుర్తింపు బెంగళూరు: శివకుమార స్వామికి కర్ణాటకలో విద్యాదాతగా ఎంతో గొప్ప పేరుంది. సాధారణంగా స్వామీజీలు ఆధ్యాత్మిక, భక్తి బోధనలు, కార్యకలాపాలకే పరిమితమవుతుంటారు. శివకుమార స్వామి మాత్రం సమాజసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. నూట పదకొండేళ్ల వయసులో శివైక్యం పొందిన శివస్వామి ఆధ్యాత్మిక గురువుగా కంటే సంఘ సేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, వేద పాఠశాలలు సహా 125 విద్యా సంస్థల్ని నెలకొల్పి లక్షల మందికి విద్యాదానం చేశారు. కుల, మతాలకతీతంగా ఎందరినో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. ‘గురుకులం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ విద్యా సంస్థల్లో ప్రస్తుతం 8,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కూడా అందజేస్తున్నారు. స్వామి ఆధ్వర్యంలో ఏటా వ్యవసాయ ఉత్సవం కూడా జరిగేది. దీనిద్వారా రైతులు ప్రయోజనం పొందేవారు. శివస్వామి వందేళ్ల పుట్టిన రోజుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. స్వామి సేవల గురించి విని ఆయనను ఎంతగానో ప్రశంసించారు. వివాదాలకు దూరం: శివకుమార స్వామి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించింది. శతాధిక వయసులో కూడా ఆయన రోజూ భక్తులను, శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన రాజకీయ నాయకులు దాదాపు అందరూ తుమకూరుకు వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం నియమంగా పెట్టుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, రాహుల్ గాంధీ, కుమారస్వామి తదితరులంతా మఠానికి వచ్చి స్వామి ఆశీస్సులు పొందినవారే. అయితే శివకుమార స్వామి రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉండేవారు. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ ఉద్యమం జరిగినప్పుడు ఆయన స్పందించలేదు. ఈ విషయంలో మఠంలోని సన్యాసులు రెండుగా చీలిపోయినా ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
శివ కుమార స్వామిజీ శివైక్యం
-
శివ కుమార స్వామిజీ శివైక్యం
బెంగళూరు : తుమ్కురు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ(111) శివక్యైం చెందారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. అయినా స్వామిజీ ఆరోగ్యం కుదటపడలేదు. గత 15రోజులుగా ఆయన వైద్యుల సమక్షంలోని చికిత్స పొందారు. ఇక స్వామిజీ ఆరోగ్య పరిస్థితిపై గత మూడు రోజులుగా గోప్యత పాటించిన అధికారులు.. సోమవారం 11.44 నిమిషాలకు తుదిశాస్వ విడిచారని ప్రకటించారు. ఇక స్వామిజీ మృతిపై కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. స్వామిజీ మరణవార్తతో అధికారులు మఠం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది సంఖ్యలోని ఆయన భక్తులు స్వామిజీ కడచూపు కోరకు అక్కడికి చేరకుంటున్నారు. మంగళవారం సాయంత్రం శివకుమార స్వామిజీ అంతి సంస్కారాలు జరగనున్నాయి. స్వామిజీ మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం రేపు సెలవుదినంగా ప్రకటించింది. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్ అవార్డును అందజేసింది. ఇక ఉదయం స్వామిజీ ఆరోగ్యం విషమించిందని అధికారులు ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మరి మఠానికి వచ్చారు. ప్రధాని దిగ్భాంత్రి శివకుమార స్వామిజీ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసమే శివకుమార స్వామిజీ జీవించారని, పేదరికం, సమానత్వం, ఆకలిపై పోరాటం చేశారని ట్వీట్ చేశారు. అణగారిన వర్గాలకు మంచి విద్యా, వైద్యం అందించడంలో స్వామిజీ కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. తాను తుమ్కురు సిద్ధగంగా మఠాన్ని దర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
సిద్ధగంగ మఠంలో రశ్మిక
కర్ణాటక, తుమకూరు: తెలుగు, కన్నడ చిత్రాల యువ హీరోయిన్ రశ్మిక మందణ్ణ ఆదివారం తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నటుడు రక్షిత్‌శెట్టితో ప్రేమ, పెళ్లికి బ్రేకప్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లితో కలిసి ఆమె స్వామీజీని కలిశారు. మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. -
ఆధ్యాత్మిక శోభ
► నేడు సిద్ధగంగ మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు ► లక్షకు పైగా హాజరు కానున్న భక్తులు ► 110వ వసంతంలోకి అడుగిడనున్నశివ కుమార స్వామీజీ ► గురువందన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గవర్నర్ శతాధిక స్వామీజీగా పేరు గడించిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామిజీ శనివారం 110వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం గవర్నర్ వజుభాయ్ రూడావాలా గురువందనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తుమకూరు: శతాధిక స్వామీజీగా పేరు గడించిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివ కుమార స్వామి శనివారం 110వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తుమకూరు, బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు రానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సిద్దగంగ మఠంలో జరుగు గురువందనా కార్యక్రమం మహోత్సవాన్ని గవర్నర్ వజుభాయ్ రూడావాలా ప్రారంభించనున్నారు. అదే విధంగా మైసూరు సుత్తూరు మఠానికి చెందిన శ్రీ శివారాత్రి దేశికేంద్ర మహాస్వామి, విజయపుర జ్ఙానయోగానంద సిద్ధేశ్వర స్వామీజీతో పాటు వివిధ మఠాలకు చెందిన స్వామిజీలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఇప్పటికే తుమకూరు నగరంలో ప్రముఖ వ్యక్తులు సంఘ సంస్థలు వివిద రకాల స్వామిజీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడానికి ఆన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం లక్ష మంది భక్తులు మఠానికి రానున్నట్లు సమాచారం. నేడు స్వామిజీ కార్యక్రమాలు : శనివారం శివకుమార స్వామిజీ పుట్టినరోజు సందర్భంగా శనివారం తెల్లవారుజామున స్వామిజీ నిద్రలేచి సంద్వవందన కార్యక్రమం, అనంతరం 5 గంటల సమయంలో హిష్టి లింగపూజ చేస్తారు. అనంతరం ఆరు గంటలకు మఠంలో జరిగే సామూహిక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం స్వామిజీ భక్తులను కలుస్తారు. అనంతరం గురువందనం కార్యక్రమంలో పాల్గొంటారు.