Shobha yathra
-
కాషాయ క్షేత్రంగా యాదాద్రి పుణ్యక్షేత్రం
యాదాద్రి: మహా రామభక్తుడు.. ధర్మ రక్షకుడైన ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శోభాయాత్ర నిర్వహించారు. దీంతో యాదాద్రి కాషాయ క్షేత్రంగా మారింది. ఈ యాత్ర ఆదివారం హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై హనుమాన్, శ్రీరాముడు, శివాజీ మహరాజ్‌ల భారీ విగ్రహాలతో సుమారు 6గంటలపాటు జరిగింది. కాషాయపు దుస్తులతో హనుమాన్ నామస్మరణం చేస్తూ కోలాటం, సంప్రదాయ నృత్యాలతో యాత్ర కొనసాగడం చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒంటెలపై చిన్నారులు శోభాయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ శోభయాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, శ్రీ రామకష్ణనందగిరి స్వామిజీ, శ్రీకష్ణ అఖండనామ సంకీర్తన ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కష్ణదాసు ప్రభుజీ, మాతా మధు మంజరీదేవి, త్రిశక్తి పీఠాధిపతి బాలశివ స్వామిజీలు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలతో శోభాయాత్ర
తెనాలి టౌన్: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో 108 కృష్ణా జల కలశాలతో శోభయాత్ర నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఉదయం ఆరాధన, పుణ్యహవచన నిర్వహించిన సంఘ సభ్యులు కృష్ణా నది వద్ద తాళ్ళయపాలెంలో సేకరించిన పవిత్ర జలాలను పట్టణంలో ఊరేగించారు. అనంతరం గోవర్ధనస్వామి ఆలయంలో గోవర్ధన, వీరప్రతాప∙ఆంజనేయ, విఖానస చార్య స్వామివార్లకు విశేష స్నప్న నిర్వహించారు. చతుర్వేద్ధ పారాయణ పంచసూక్త పారాయాణాలు చేశారు. దాస్యా సాహిత్య ప్రాజెక్టు బృందం సభ్యులు గోవింద నామ సంకీర్తనాలు ఆలపించారు. సంఘ నాయకులు దన్వంతరి, టి.రఘు, వి.మాధవకుమార్, అర్చకులు భట్టాచార్యులు, రామాచార్యులు, కేసవకుమార్, యస్వంత్, వైభవ్, హరిబాబు, నాగమారుతీ, తదితరులు పాల్గొన్నారు.