Sholay stars
-
గబ్బర్ సింగ్ జయంతి.. 10 పవర్ఫుల్ డైలాగ్‌లు
Amjad Khan Birth Anniversary: సినిమాల్లో హీరోల తర్వాత పవర్‌ఫుల్‌గా ఉండే క్యారెక్టర్లు విలన్లవే. వారు ఎంత విలనిజం చూపిస్తే హీరోకు అంత మంచిపేరు వస్తుంది. అలాంటి చాలా మంది విలన్లను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూసింది. కానీ అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. అత్యంత చెడ్డవాడిగా, గొప్ప విలన్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా గబ్బర్ అవుతాడు. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ తప్ప మరెవరూ ఆ ఐకానికి క్యారెక్టర్‌కు న్యాయం చేయలేకపోయేవారేమో. షోలేలో అతని నటన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, ఇతరులను కనపడకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప నటనను కనబర్చిన అంజాద్ ఖాన్ 81వ జయంతి రేపు (నవంబర్ 12). ఆయన జయంతి సందర్భంగా షోలే చిత్రంలో అంజాద్ ఖాన్ కొట్టిన డైలాగ్‌లను ఓసారి గుర్తు చేసుకుందామా. 1. కిత్నే ఆద్మీ తే.. 2. జబ్ తక్ తేరే పైర్ చలేంగే ఉస్కీ సాన్స్ చలెగీ.. తేరే పైర్ రూకే తో యే బందూక్ చలేగీ 3. తేరా క్యా హోగా కాలియా ? 4. జో డర్ గయా.. సమ్జో మర్ గయ 5. యహా సే పచాస్ పచాస్ కోస్ దూర్ గావో మే.. జబ్ బచ్చా రాత్ కో రోతా హై, తో మా కెహెతీ హై బేటే సో జావో.. సోజా నహీ తో గబ్బర్ సింగ్ ఆ జాయేగా 6. హోలీ కబ్ హై.. కబ్ హై హోలీ, కబ్? 7. యే రామ్‌ఘర్ వాలే ఆప్నీ బేటియోంకా కౌన్ చక్కీ కా పిసా ఆతా కిలాతే హై రే? 8. క్యా సమజాకర్ ఆయే తే.. కీ సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శెభాషీ దేగా? 9. చే గోలీ ఔర్ ఆద్మీ తీన్.. బహుత్ నయిన్సాఫీ హై యే 10. యే హాత్ హమ్ కో దే ఠాకూర్.. -
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'
ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు. '40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు. ఈ ఆల్బమ్‌లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్‌ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.