డెంటల్ కౌన్సెలింగ్
చిగుర్ల వ్యాధిలో నొప్పి తెలియదని ఎక్కడో చదివాను. మరి చిగుర్లకు వ్యాధి ఉన్నట్లు గుర్తించడం ఎలాగో తెలపండి.
- ఉదయ్‌కుమార్, అనంతపురం
చిగుర్లను జింజివా అనీ, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్ను జింజివైటిస్ అనీ అంటారు. వ్యాధి జింజివైటిస్ దశలో ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. చిగుళ్లు ఎర్రగా మారడం, ముట్టుకుంటే జివ్వుమనడం, ఉబ్బినట్లుగా ఉండటం వంటివి జింజివైటిస్ లక్షణాలు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే డెంటిస్ట్‌ను కలవండి.
డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి
ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్