'మంటల్లో చస్తావన్నా.. ఆ వీడియోనే చూస్తానన్నాడు'
బెర్లిన్: ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ఓ వీడియో షాపులో మంటలు షాపంతా వ్యాపించాయి. ఆ పాపులో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓ క్యాబిన్లో ఉన్న ఓ వ్యక్తి మాత్రం డోర్ లాక్ చేసుకుని పోర్న్ వీడియో చూస్తూ అందులో లీనమైపోయాడు. మంటలు ఆ వ్యక్తి ఉన్న క్యాబిన్‌కు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసినా.. ఆ గదిలో పొగ కమ్మేసినా అతను దగ్గుతూనే వీడియో చూస్తున్నాడు కానీ బయటకు మాత్రం రాలేదు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు. అయినా అతను నిరాకరించాడు. ఆ సెక్స్ వీడియో పూర్తిగా చూడనిదే బయటకు రానంటూ లోపలే ఉండిపోయాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది బలవంతంగా అతణ్ని బయటకు తీసుకుని వచ్చారు. ఈ సంఘటన జర్మనీలోని సెయింట్ పౌలీలో జరిగింది. కాగా అతని వివరాలను బయటకు వెల్లడించలేదు.