లఘుచిత్రాలు.. సందేశాత్మక వృత్తాలు
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
ముగిసిన షార్టఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
{పేక్షకులతో కిక్కిరిసిన కేయూ ఆడిటోరియం
పోచమ్మ మైదాన్ : పదిహేను నిమిషాల నిడివితో తీసే లఘుచిత్రాలు.. మంచి సందేశాన్ని ఇచ్చే ఇతివృత్తాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. షార్టఫిల్మ్లు సమాజానికి ఎంతో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనం గా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక సినిమా చూసేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని, అదే యూ ట్యూబ్‌లో చాలా షార్ట్‌ఫిల్మ్‌లు చూడవచ్చని తెలిపారు. షార్టఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ ఐశ్వర్యాన్నిచ్చింది : విజయేంద్రప్రసాద్
బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడు తూ పశ్చిమ గోదావరి జిల్లాలో తాను పుట్టినప్పటికీ బతకడానికి హైదరాబాద్‌కు వచ్చానని.. ఈ ప్రాంతం తనకు ఐశ్వర్యాన్నిచ్చిందని చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ మహేంద్ర మాట్లాడుతూ 100కు పైగా వచ్చిన లఘుచిత్రాల్లో ఐదింటిని ఎంపిక చేయడం క ష్టంగా మారిందన్నారు. అంతర్జాతీయ లఘుచిత్రోత్సవంలో ప్రదర్శించిన ఫిల్మ్‌లలో విషయం బాగుంద ని... టెక్నికల్ పరంగా కొంత వెనక ంజలో ఉన్నాయన్నారు. కాగా, ముగింపు వేడుకలకు హాజరైన సినిమాహాల్ హీరో రాహుల్‌తోపాటు చిత్ర బృందం సందడి చేసింది. ఇదిలా ఉండగా, వేడుకల్లో రాధిక యాంకరిం గ్ ఆకట్టుకుంది. అంతర్జాతీయ లఘు చిత్రోత్సవ కమి టీ చైర్మన్ నాగేశ్వర్రావు, దర్శకుడు ప్రభాకర్ జైనీ, జ్యూరీ మెంబర్లు కేవీపీ మహేంద్ర, వాల్మీకి వడ్డేమాని, సైదా, కేఎల్.ప్రసాద్, పూర్ణచందర్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆట పాట
ముగింపు వేడుకల్లో భాగంగా సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రముఖ సినీ నేపథ్యగాయని కౌసల్య పాడిన ‘రామా రామా రామా నీలిమేఘ శ్యామ’, ‘గుమ్ గుమారే గుమ్గుమ్గుమ్’ పాటలు, చరణ్ డ్యాన్స్ గ్రూప్ చేపట్టిన నృత్యా లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కందిరీగ సినిమా హీరోయిన్ అక్ష మాట్లాడుతూ షార్ట్ఫిల్మ్లకు మంచి భవిష్యత్ ఉందన్నారు.
అవార్డు విన్నర్స్
ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో మూడు రోజుల్లో మొత్తం 118 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ లఘుచి త్రంగా సీతావలోకనం, ఉత్తమ దర్శకుడిగా సీతావనలోకం లఘుచిత్రం డెరైక్టర్ వేణుమాదాల, ఉత్తమ మేల్ ఆర్టిస్టుగా చిచోర ఫిల్మ్ నటుడు ఆర్.సుమన్, ఉత్తమ ఫీమేల్ ఆర్టిస్టుగా అమ్మానాన్నకు ప్రేమతో లఘుచిత్రం నటి దివ్య, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ కొలంబస్ లఘుచిత్రం నటుడు గోపి, ఉత్తమ అంతర్జాతీయ చి త్రంగా చైనీస్ చిత్రం బస్ 44, స్పెషల్ జ్యూరీ-1 అవార్డును సీతారామరాజు లఘుచిత్రం నటుడు కరుణాకర్, స్పెషల్ జ్యూరీ-2 అవార్డును చదువు లఘుచిత్రం నటుడు లాలు గెలుచుకున్నారు.
రెడ్డి కాదు మాదిగ...
స్టేజీపైకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌ను ఆహ్వానిస్తున్న సమయంలో యాంకర్ ఆయనను ‘దయాకర్‌రెడ్డి’ అంటూ సంబోధించారు. దీంతో కార్య క్రమానికి హాజరైన ప్రేక్షకులు దయాకర్‌రెడ్డి కాదు.. దయాకర్మాదిగ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు యాంకర్ సరిదిద్దుకొని దయాకర్ అని పిలు స్తూ ఆహ్వానించింది.