shotdead
-
ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత
శ్రీనగర్: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బీజేపీ ఉపాధ్యక్షుడి కాల్చివేత
శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌కు కొద్దిగంటల ముందు అనంత్ నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ నివాసాన్ని చుట్టముట్టిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపారు. జిల్లాలోని నౌగ్రాం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2008, 2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దురూ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మిర్ చాలాకాలంగా బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మిర్‌కు భద్రతను అధికారులు ఉపసంహరించడంతో ఈ దారుణం జరిగిందని బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆరోపించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా మిర్‌కు భద్రతా సంస్ధలు భద్రతను కల్పించలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా మిర్‌కు భద్రతపై అధికారులకు తాము పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. మిర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఓ కుమారుడు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు విడతల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం జరగనున్న అయిదో దశ పోలింగ్‌కు 48 గంటల ముందు బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. -
అమెరికాలో భారత అధికారి కాల్చివేత
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారిని ట్రాఫిక్ విధుల్లో ఉండగా గుర్తుతెలియని సాయుధ దుండగుడు కాల్చిచంపాడు. న్యూమాన్ పోలీస్ విభాగానికి చెందిన కర్పోరల్ రొనిల్ సింగ్ (33) క్రిస్మస్ రాత్రి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, వాహనంపై వచ్చిన దుండగుడు ఆయనపై నేరుగా కాల్పులు జరిపాడు. ఘటనా స్ధలంలో గాయాలతో పడిఉన్న సింగ్‌ను స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కాగా ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడని అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడి ఊహాచిత్రంతో పాటు, వాహనం వివరాలను వెల్లడిస్తూ తమకు అనుమానితుడి సమాచారం అందించాలని కోరారు. కర్పోరల్ సింగ్‌కు భార్య అనామిక, ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. కాల్పులు జరిగే కొద్ది గంటల ముందే కర్పోరల్ సింగ్ క్రిస్మస్ వేడుకల్లో భార్య, కుమారుడితో ఆనందంగా గడిపారని, వారితో కలిసి ఫోటోలు దిగారని స్ధానికులు తెలిపారు. కాగా సింగ్ మృతికి పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు. కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ బ్రౌన్ సింగ్ భార్య, కుమారుడు, కొలీగ్స్‌కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
లైవ్‌లో మాట్లాడుతుండగా.. రేడియో జాకీ హత్య
రియోడిజనీరో: బ్రెజిల్లో దారుణ ఘటన జరిగింది. ఓ రేడియో జాకీని దుండగులు అతి కిరాతకంగా కల్చి చంపారు. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్లోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. జోవా వెల్డసిర్ డీ బోర్బా(52) బ్రెజిల్ రేడియో డిఫ్యుసొరా ఏఎమ్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు 10 ఏళ్లుగా నేర సంఘటనలను రిపోర్ట్ చేసే కార్యక్రమాలు నిర్వహించిన బోర్బా ఇటీవలే సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బోర్బాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో బోర్బా పాటు ఉన్న సహోద్యోగి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సిగరెట్ తాగడానికి తాను బయటకు వెళ్లి వచ్చే సరికి దుండగులు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడిచారు. క్రైమ్ ఘటనలను రిపోర్ట్ చేసే సమయంలోనే బోర్బాకు నేరస్తుల నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బ్రెజిల్లో ఎనిమిది మంది రేడియో వ్యాఖ్యాతలు హత్యకు గురయ్యారని బ్రెజిల్ అసోసియేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ప్రజెంటర్స్ వెల్లడించింది.