భాగ్యనగరిపై స్వైన్‌ఫ్లూ దాడి!
హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న స్వైన్‌ప్లూ నగర ప్రజలకు తీవ్రఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని, మరో వారం రోజులపాటు నగర ప్రజలు స్వైన్‌ఫ్లూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు కానీ, ఇళ్లలోంచి బయటకు రాకుండా తలుపులు మూసుకుంటే స్వైన్‌ఫ్లూ దాడికి గురికామనే హామీ ఏమైనా ఉందా? వైద్య నిపుణుల నుంచి ఈ వ్యాధిపై రోజు కో తీరుగా వస్తున్న రకరకాల, పొంతనలేని ప్రకటనలతో ప్రజలు కలవరపడుతున్నారు.
మరోవైపున ఆస్పత్రులలో వైద్యం సరిగ్గా అందక, రోగులు మరణిస్తున్నారు. సరైన మందులు సమయానికి అందకపోవడంతోపాటు పలు కారణాలతో ప్రాణాలు గాలిలో కల సిపోతున్నా ప్రభుత్వం మాత్రం అలాంటింది ఏదీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి మన ఆరోగ్య మంత్రి సర్కారు దవాఖానాకు వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వైద్యసేవలు ఇతర అం శాలు పరిశీలించాలి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దీనిపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం చేయాలి. అలాగే ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉంచాలి. వ్యాధి వచ్చాక పెరిగే భయాల కంటే, వ్యాధి ఎవరికి వస్తుందనే భయాలు ఇప్పుడు నగరంలో అన్నిచోట్లా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్ప టికైనా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్