showrooms
-
దేశవ్యాప్తంగా ఫ్రాంక్లిన్ ఈవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఫ్రాంక్లిన్ ఈవీ దేశవ్యాప్తంగా డిసెంబర్‌కల్లా 200 షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ తదితర 30 నగరాల్లో 54 షోరూంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోనే 14 షోరూంలు ఉన్నాయి. 2021లో అమ్మకాలను ప్రారంభించి రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లకు చేరువయ్యామని ఫ్రాంక్లిన్ ఈవీ ఫౌండర్ డాక్టర్ శశిధర్ కుమార్ మంగళవారమిక్కడ తెలిపారు. నెలకు 3,000 యూనిట్లు.. కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయని కో–ఫౌండర్ రంజిత్ కుమార్ తెలిపారు. ‘నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాం. ఇతర దేశాల్లో అడుగు పెడతాం. 2023 చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరాలన్నది లక్ష్యం. ఇందుకు రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. కంపెనీలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్లాంటు ఉంది’ అని చెప్పారు. తొలి డ్యూయల్ బ్యాటరీ.. కోరో మోడల్‌కు డి మాండ్ బాగుందని కో–ఫౌండర్ నవీన్ కుమార్ తెలిపారు. ‘దక్షిణాదిన రిమూవ బుల్ డ్యూయల్ బ్యా టరీతో తయారైన తొలి మోడల్ ఇదే. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పవర్ ప్లస్, నిక్స్ డీలక్స్ మోడళ్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్‌కల్లా మరో 2 స్కూటర్లను ప్రవేశపెడతాం. కస్టమర్ల ఇంటి వద్దే సరీ్వస్ అందిస్తున్నాం. 2.1–3 కిలోవాట్ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ రిమూవబుల్ బ్యాటరీలను పొందుపరిచాం. వీటికి ఐక్యాట్–ఏఐఎస్ 156, బీఐఎస్, సీఈ, ఐఎస్వో, ఆర్‌వోహెచ్‌ఎస్ ధ్రువీకరణ ఉంది. ధర రూ.75 వేల నుంచి ప్రారంభం’ అని చెప్పారు. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్
రవాణాశాఖలో సంస్కరణలు కొన్నచోటే శాశ్వత రిజిస్ట్రేషన్ వెంటనే నంబరు కేటాయింపు నెల్లూరు (టౌన్): రవాణాశాఖ పలు సంస్కరణల అమలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎల్ఎల్ఆర్, లైసెన్స్‌లకు సంబంధించి శ్లాట్‌ను ఆన్లైన్లో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాలు కొన్న షోరూంల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పటి దాకా షోరూంలలో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాత్రమే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి పరుగు తీయాల్సి వచ్చేది. ఈ ప్రయాసలను తగ్గించేందుకు రవాణాశాఖ వాహనం కొన్నచోటే శాశ్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. షోరూంల డీలర్లకు గురు, శుక్రవారాల్లో ఆన్లైన్ విధానంలో శాశ్వత రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫ్యాన్సీ నంబర్లు సైతం ఆన్లైన్లో.. వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లను సైతం వారం తర్వాత ఆన్లైన్లో ఉంచేందుకు రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెన్యూవల్స్, ట్రాన్స్ఫర్లు తదితర 83 రకాలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవల కోసం ప్రతి వాహనదారుడు, వినియోగదారుడు రవాణా కార్యాలయానికి వెళ్లాల్సిని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా అధికారులు, ఏజెంట్లు కుమ్మక్కై వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు రావడంతో వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో సేవలు పొందే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. 24గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ షోరూంల్లో ఆన్లైన్ విధానం ద్వారా వాహనానికి 24గంటల లోపు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటి దాక వాహనదారుడు కేవలం టీఆర్ మాత్రమే చేయించుకుని కొన్ని నెలల పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరుగుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక నుంచి షోరూంలో వాహనదారుడి సంతకం, వేలిముద్రలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌కార్డులోని వేలిముద్రను సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతర వాహనదారుడు ఈమెయిల్ ఐడీకి వాహనానికి సంబంధించిన శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరును పంపిస్తారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు – శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. శనివారం నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫోటోలను షోరూం నిర్వాహకులు రవాణా కార్యాలయానికి అన్లైన్లో అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో అధికారులు వాటిని నిర్ధారించిన తరువాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేయనున్నారు. -
రిజిస్ట్రేషన్ ః షోరూమ్
తణుకు : రవాణా శాఖ సేవల్లో సంస్కరణలు తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆన్లైన్ సేవలను అందిస్తుండగా.. ఈనెల 15వ తేదీ నుంచి వాహనాలకు షోరూమ్‌ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికేందుకు దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం వాహనాలు కొన్న వెంటనే షోరూమ్‌ల్లోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అందిస్తున్నారు. ఇకపై శాశ్వత రిజిస్ట్రేషన్లను సైతం అక్కడే చేసే విధానాన్ని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేస్తున్నారు. 15నుంచి మన జిల్లాలోనూ ఈ పద్ధతి అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై అవగాహన కల్పించేందుకు వాహనాలను విక్రయించే షోరూమ్‌ల నిర్వాహకులకు గురు, శుక్రవారాల్లో ఏలూరులో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. సేవలన్నీ ఆన్లైన్.. జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాల యాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి ఆన్లైన్లోనే చేసేలా యం త్రాంగం చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఫ్యాన్సీ నంబర్లను సైతం ఆన్లైన్లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏలూరులోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయం, భీమవరంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో యూనిట్ కార్యాల యాలు ఉన్నాయి. వాటి పరిధిలోని వాహనాలకు రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్స్, నకళ్లు వంటి 83 రకాల సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలన్నీ పొందడానికి వాహనదారులు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు అధికారులు–వాహనదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సొమ్ములు గుంజు తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వాహనదారులే ఆన్లైన్ ద్వారా సేవలు పొందేవిధంగా రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వాహనాలను విక్రయించే షోరూములకు అప్పగించనున్నారు. గంటలో శాశ్వత రిజిస్ట్రేషన్ షోరూంలో వాహనం కొనుగోలు చేసిన 15 నిమిషాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్, గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు వాహనదారుడి సంతకం, వేలి ముద్రలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణా శాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌లోని వేలిముద్ర సరి పోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతరం పత్రాలను వాహన యజ మాని ఇంటికి పంపిస్తారు. ఈ విధానంపై జిల్లాలోని వాహనాల షోరూం యాజమాన్యాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 15నుంచి అమలు చేయనున్నారు. ఫ్యాన్సీ నంబర్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ కావాల్సిన వాహనదారులు రవాణా కార్యాయాల్లో సంప్రదించాలి. కార్యాలయానికి రానవసరం లేదు వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫొటోలను షోరూమ్ నిర్వాహకులు రవాణా శాఖ కార్యాలయానికి ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు. కార్యాలయ అధికారులు వాటిని నిర్థారించిన తర్వాత గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఫ్యాన్సీ నంబర్ల విషయంలో 15 రోజుల్లో స్పష్టత వస్తుంది. – ఎస్.సత్యనారాయణమూర్తి, డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏలూరు