'సీఎం శవరాజకీయాలు'
న్యూఢిల్లీ: ఆప్ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హద్దులు దాటొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిదానికి ప్రధాని నరేంద్ర మోదీని వివాదాల్లోకి లాగొద్దని హెచ్చరించారు.
కేజ్రీవాల్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ నిపుణుడిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ విమర్శించారు. నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్దంగా పనిచేయడం లేదని ధ్వజమెత్తారు.
ప్రధానికి సలహా ఇచ్చే స్థాయి కేజ్రీవాల్ కు లేదని బీజేపీ ఢిల్లీ ఇన్ చార్జి శ్యామ్ జాజు అన్నారు. పబ్లిసిటీ కోసం ప్రజాధానం వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఆనంద్ ప్రభాత్ ప్రాంతంలో జరిగిన 19 ఏళ్ల యువతి హత్యోదంతంతో కేజ్రీవాల్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.