వీసాల మోసగాళ్లపై హెచ్చార్సీకి ఫిర్యాదు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ హెచ్చార్సీ గడపతొక్కింది. సైనిక్‌పురికి చెందిన తాటిపత్రి డానియల్, షీబారాణి దంపతులు విదేశాల్లో ఉద్యోగం చూపుతామంటూ తన వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇర్ఫానా సుబానీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. గతంలో వీరిపై సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కూడా ఇదే విషయంలో కేసులున్నాయని ఆమె బుధవారం అందజేసిన ఫిర్యాదులో వివరించింది.