గజరాజుపై గజానన..
సిద్ధాంతం (పెనుగొండ) : వినాయక చవితి ఉత్సవాలను పోటాపోటీగా నిర్వహించడం ఆనవాయితీ. విగ్రహాలను నిలపడం నుంచి నిమజ్జనం వరకూ ఉత్సవ కమిటీలు ప్రత్యేకతను చాటుకునేందుకు తహతహలాడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆదివారం సిద్ధాంతంలోని బూరిగలంక వరసిద్ధి వినాయక యూత్ వారు ఏకంగా కేరళ నుంచి గజరాజును తీసుకువచ్చారు. ఏనుగుపై గణపతిని ఉంచి ఊరంతా ఊరేగించారు. అనంతరం గ్రామంలోని కేదారీఘాట్ వద్ద గోదావరిలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం గావించారు. గజరాజుపై ఊరేగిన గజాననను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.