సిద్ధపల్లెలో ఇరువర్గాల ఘర్షణ
ఆత్మకూరు రూరల్: సిద్ధపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం కారణంగా వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారి తీసింది. రాత్రి 7.30 సమయంలో ఇరువర్గాలకు చెందిన కొందరు కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోకేష్ కుమార్ తెలిపారు.