breaking news
Siddharth Kaushal
-
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్.. ఏపీ పోలీస్ బిగ్ బాస్ ఎంట్రీ!
సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) సిద్ధార్థ్ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరుగుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్ బిగ్ బాస్‌ను రంగంలోకి దించారు.కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్ బిగ్ బాస్ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్ కౌశల్ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్ఎస్: సిద్ధార్థ్ కౌశల్ సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్ కౌశల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులనూ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగివేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టంది. డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవి శంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. -
టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్ పై ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
-
కడపకు చేరుకున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సిద్దార్థ్ కౌశల్ ఆదివారం కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ఎస్వీ.కృష్ణారావు, కడప డీఎస్పీ ఎస్ఎండీ.షరీఫ్, డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు అశోక్‌రెడ్డి, వెంకట కుమార్, ఆర్ఐలు వీరేష్, సోమశేఖర్ నాయక్ తదితరులు పూల బొకేలతో స్వాగతం పలికారు. సోమవారం తన కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ బదిలీపై అనంతపురం జిల్లాకు వెళ్లిన విషయం విదితమే. -
Number Plates: దొరికితే వదిలేదే లే!
సాక్షి, కర్నూలు: పోలీసులు తనిఖీ చేస్తున్నారట.. ఫొటో తీసి నంబర్ ప్లేట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేద్దాం.. ప్లేట్‌ను వంచేద్దాం లేదా చివర్లను విరగ్గొడదాం లేదా ప్లేటే తీసేద్దాం అప్పుడెలాంటి జరిమానాలు రావు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు చేస్తున్న ఆలోచన ఇదీ. ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాఅంతటా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం ద్విచక్ర వాహన చోదకులే ఉంటున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను విస్మరించిన వారికీ నష్టాలు తప్పవని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వాహనాలు చోరీకి గురైనప్పుడు గుర్తింపు అసాధ్యంగా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన చోదకుడు నష్టపోతే ఫిర్యాదు చేయడం కూడా ఇబ్బందికరమే. జిల్లాలో సుమారు 10 శాతం మేర వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసుల అంచనా. నంబర్ ప్లేట్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. విరిగిందన్న సాకుతో.. ప్రస్తుతం వాహనాలన్నింటికీ హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నంబర్ ప్లేట్లు విరిగిపోతున్నాయి. ఫలితంగా వాహన నంబర్లను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా ప్లేట్‌ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ ఉండి విరిగిపోయినా, దెబ్బతిన్నా వాటిస్థానంలో కొత్త ప్లేట్ బిగించుకోవాలని సూచిస్తున్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు లోబడి సిరీస్, అంకెలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి లేకుంటే జరిమానాలు విధిస్తున్నారు. చదవండి: (వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం) నంబర్ ప్లేట్‌తోనే వాహనం గుర్తింపు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏర్పాటు చేసుకునే నంబర్ ప్లేట్‌తోనే వాహనాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పలువురు వాహన చోదకులు ఉల్లంఘనుల జాబితాలో చేరుతున్నారు. కనీస నిబంధనలు పాటించక చిక్కుల్లోకి వెళ్తున్నారు. నంబర్ ప్లేట్ రహితంగా, ఇష్టారీతిన నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వందల సంఖ్యలో జనాలు ఈ జాబితాలో చేరుతుండటం గమనార్హం. వారం రోజుల వ్యవధిలో ఉల్లంఘనలకు పాల్పడిన 7,932 మందిపై ఈ–చలానాలు విధించి రూ.21.26 లక్షలు జరిమానా వసూలు చేశారు. వారంలో కనీసం వందకు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో సుమారు 75 ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడ్డాయి. అలాగే ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నవి 150 దాకా పట్టుకున్నారు. నిర్దేశిత వ్యవధి దాటినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు కూడా తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. కనిష్టంగా వెయ్యి జరిమానా.. నంబర్ ప్లేట్ లేకపోవడం, సరిగా అమర్చుకోకపోవడం, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అక్షరాలు, అంకెలు కనిపించకుండా మార్పులు చేయడం, వెనుకవైపు ప్లేట్‌ను తీసివేయడం, ప్లేట్‌ను వంపు చేయడం తదితర అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ఉల్లంçఘనలకు పాల్పడిన వారికి కనిష్టంగా వెయ్యి జరిమానా విధిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా, రాంగ్ రూట్లో ప్రయాణించినా సిగ్నల్ జంపింగ్ చేసినా, రికార్డులు అందుబాటులో లేకపోయినా, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రం లేకపోయినా రూ.1000, లైసెన్స్ లేకపోతే రూ.500, హెల్మెట్ లేకపోతే రూ.100, నోఎంట్రీకి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు. ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యం ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా పోలీసులు వాటిని జప్తు చేస్తారు. ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. – ఎస్పీ, సిద్ధార్థ్ కౌశల్ -
కృష్ణా జిల్లా ఎస్పీకి జాతీయ స్థాయి అవార్డు
సాక్షి, కోనేరు(విజయవాడ): కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు డీజీ.బీపీఆర్–డీ (డైరెక్టర్ జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డిస్క్ అవార్డు లభించింది. కోవిడ్ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ పోలీస్ మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 4వ తేదీన డీజీ, ఐజీలకు నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లెవల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంపికయ్యారు. వీరు తమ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రదర్శించగా, అందులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రదర్శించిన ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – స్పందన ప్రాజెక్టు’ మైక్రోమిషన్ కింద ఎంపికైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు స్వయంగా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గానూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించటంతో పాటు డిస్క్ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన జిల్లా ఎస్పీని పలువురు అధికారులు అభినందించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
పద్ధతి మార్చుకోండి.. లేకపోతే..: ఎస్పీ ‘ఓపెన్’ వార్నింగ్
పాత నేరస్తులకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేరాలు చేయడం మానకపోతే కఠిన చర్యలు తప్పవని ‘ఓపెన్’గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సాక్షి, విజయవాడ: సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే సహించేది లేదని, పద్ధతి మార్చుకోకుండా తిరిగితే రౌడీషీట్లు తెరిచి, చట్టరీత్యా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కా వంటి వాటిని అక్రమ రవాణా చేసే జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 2,530 మంది పాత నేరస్తులకు సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ► ఎస్పీ మాట్లాడుతూ కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆరాటంతో కొంతమంది వ్యక్తులు మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కాల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారన్నారు. ► చదువుకున్న వారు, యువకులు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండడం బాధాకరమన్నారు. ► ఈ కేసుల్లో పట్టుపడితే ఏముంటుందిలే, బెయిల్ మీద వస్తాం, చక్కగా తిరిగేస్తామనుకొని ఇప్పటివరకూ పదే పదే తప్పులు చేస్తూ కొంతమంది నడుచుకుంటున్నారన్నారు. అటువంటి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. నేరాల అదుపునకు యాక్షన్ ప్లాన్ కృష్ణా జిల్లాలో ఈ నేరాల సంఖ్యను పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో అదనంగా మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటుచేసి, సరిహద్దు గ్రామాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, అమ్మోనియా, పటిక వంటి నిల్వలపై నిరంతర తనిఖీలు, ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. సత్ప్రవర్తనతో ఉంటే ఉద్యోగావకాశాలు.. నేరాలు విడిచి సత్ప్రవర్తనతో నడుచుకునే వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలను నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జేడీ మోకా సత్తిబాబు, జిల్లాలోని పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.