
నూతన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు స్వాగతం పలుకుతున్న పోలీసు అధికారులు
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సిద్దార్థ్ కౌశల్ ఆదివారం కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌వీ.కృష్ణారావు, కడప డీఎస్పీ ఎస్‌ఎండీ.షరీఫ్, డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు అశోక్‌రెడ్డి, వెంకట కుమార్, ఆర్‌ఐలు వీరేష్, సోమశేఖర్ నాయక్ తదితరులు పూల బొకేలతో స్వాగతం పలికారు. సోమవారం తన కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ బదిలీపై అనంతపురం జిల్లాకు వెళ్లిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment