
పెన్షనర్లకు డీఏ, ఐఆర్‌లను ప్రకటించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి కరువుభత్యం, 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024 జనవరి నుంచి మూడు విడతల కరువు భత్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే రాష్ట్ర పభుత్వం కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. 2023 జులై నుంచి పీఆర్సీ అమలులోకి రావాల్సి ఉందన్నారు. ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా కనీసం 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖాదర్ బాషా, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శులు రాంభూపాల్ రెడ్డి, అబ్దుల్ సత్తార్, జిల్లాకౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి, కొండారెడ్డి, మల్లికార్జున, రామసుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.