
అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ఆదివారం ఫ్యాక్షన్ జోన్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. గంజాయి విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎర్రగుంట్ల రోడ్డు, పాల కేంద్రం, పెన్నానది పరివాహక ప్రాంతం, చిన్నశెట్టిపల్లె రోడ్డు, అమృతానగర్, పెద్దశెట్టిపల్లె గ్రామ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టి అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించే చర్యలు చేపట్టారు.
ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడికి గాయాలు
ముద్దనూరు : మండలంలోని డీయన్‌పల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు నందకిషోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కొసినేపల్లె గ్రామానికి చెందిన కిషోర్ ముద్దనూరుకు మోటార్‌బైక్‌పై వస్తుండగా ఎదరుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో కిషోర్ కాలికి తీవ్ర గాయం కాగా అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు.

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా