సిద్ధేశ్వరుడికి లక్ష పుష్పార్చన
హన్మకొండ పద్మాక్షికాలనీలోని సిద్ధేశ్వరాలయంలో శ్రావణమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం సిద్ధేశ్వరస్వామికి అన్నపూజ చేశారు. తర్వాత గులాబీ, చామంతి పూలతో అలంకరించి లక్ష పుష్పార్చన నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్, మధుకుమార్, సురేష్కుమార్ పాల్గొన్నారు. –న్యూశాయంపేట