31న చెస్ టోర్నమెంట్ పోటీలు
ఏలూరు రూరల్ : ఈ నెల 31వ తేదీన అబ్రహం, గ్యారీ కాస్పరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించనున్నామని అకాడమీ డైరెక్టర్ జి.యోహానాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సిద్ధార్థ విద్యాలయ ఆవరణలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 3.00 గంటల వరకు అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు 9705306076లో సంప్రదించాలన్నారు.