‘టి’ బిల్లును పార్లమెంట్లో పెట్టకండి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టకూడదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి డి మాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సాప్స్ ఆధ్వర్యంలో తిరుపతి ము న్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సర్కిల్లో గురువారం ఆందోళనకు దిగారు. విశ్వం విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్పొరేషన్ కా ర్యాలయం సర్కిల్ వరకు చేరుకున్నా రు. అక్కడ మానవహారంగా ఏర్పడి కేం ద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు.
కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో తిరస్కరించారన్నారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చరిత్ర ఇప్పటివరకూ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, రాయలసీమ ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, విశ్వం విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలపై తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు.
ఏపీఎన్జీవో నాయకులు తాళ్లపాక సురేష్, మహేష్‌బాబు, ఐఎంఏ, తిరుపతి బార్ అసోసియేషన్ రమణ స్కూటర్లపై ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, గేట్, ఏటీఎన్ డిగ్రీ కళాశాల, చైతన్య, విజయవాడ నారాయణతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల సర్కిల్లో ఏపీఎన్జీవోలు ఆందోళనకు దిగారు. సురేష్‌బాబు ఆధ్వర్యంలో నాయకులు హాజరయ్యారు.