మీ సొంతింటి కల సాకారం కోసం ‘సాక్షి’ ప్రాపర్టీ షో వచ్చేసింది!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను మరింత చేరువ చేసేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు వచ్చింది. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సాక్షి 14వ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. నగరానికి చెందిన 20కి పైగా నిర్మాణ సంస్థలతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంకులు కూడా ఈ షోలో పాల్గొననున్నాయి. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షోను ప్రారంభించనున్నారు. ప్రవేశం ఉచితం.
మెయిన్ స్పాన్సర్: అపర్ణా
అసోసియేట్ స్పాన్సర్లు: వాసవి గ్రూప్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్
కో–స్పాన్సర్లు: సాకేత్ ఇంజనీర్స్, శిల్పా రాఘవ ప్రాజెక్ట్స్
పాల్గొనే ఇతర సంస్థలు: ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, కపిల్ ప్రాపర్టీస్, ఎన్సీసీ అర్బన్, శ్రీరాధే రియాల్టీ, వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఏలియాంటో గ్రూప్, అసెట్ప్రీ, హస్తినా, గ్రీన్ హోమ్ ఐటీ లేక్‌సిటీ, మహిధరా ప్రాజెక్ట్స్, సీతా షెల్టర్స్, రిధిరా జెన్, శ్రీ విజయ గణపతి అవెన్యూస్, యోషిత ఇన్ఫ్రా, కెనరా, ఎస్బీఐ బ్యాంకులు.