silver ornaments
-
ఏడుపాయల క్షేత్రంలో చోరీ
పాపన్నపేట (మెదక్): మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రంలో చోరీ జరిగింది. అమ్మవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వెండి గడప తొడుగును ఈవో కార్యాలయంనుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో ఆలయ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్లో మంజీర నదికి వరదలు వచ్చిన సమయంలో ఆలయ అర్చకులు గర్భగుడి గడపకు ఉన్న వెండి తొడుగు తీసి ఈఓ కార్యాలయంలో భద్రపర్చారు. అయితే మూడు రోజుల క్రితం వెండి తొడుగు కనిపించక పోవడంతో కార్యాలయంలో వెతికారు. ఎంత వెతికినా వెండి తొడుగు దొరక్కపోవడంతో ఈఓ శ్రీనివాస్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంగయ్య తెలిపారు. వెండి గడప తొడుగు సుమారు రెండు కిలోల వంద గ్రాముల బరువు, రూ.84 వేల విలువ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వెండి తొడుగు దాచి ఉంచిన కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం. గతంలోనూ చోరీలు.. ఏడుపాయల క్షేత్రంలో గతంలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఆలయ హుండీని పగులగొట్టి సొత్తును దోచుకెళ్లారు. రెండేళ్ల క్రితం ఇనుప స్క్రాప్ మాయమైంది. ఇటీవల ఘనపురం ఆనకట్టకు వెళ్లే దారిలో బిగించిన సీసీ కెమెరాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటివరకు దొంగలు దొరకలేదు. పలు దొంగతనాల్లో ఆలయ సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
రావులపాలెం, రంగంపేటల్లో వేర్వేరు సంఘటనలు రావులపాలెం : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 49 కాసుల బంగారం, సుమారు మూడున్నర కిలోల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. రావులపాలెం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని ఒక ఇంటిలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న తుట్టగుంట శ్రీరామచంద్రమూర్తి కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్సీలో ఎంపీహెచ్ఈఓగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో విధులకు సెలవు పెట్టారు. సోమవారం ఇంటికి తాళాలు వేసి భార్య రామలక్ష్మితో కలసి కపిలేశ్వరపురం మండలం కోటిపల్లిలోని అత్తవారింటికి వెళ్లారు. మంగళవారం ఉదయం స్థానికులు ఫోన్ చేసి, ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయని చెప్పారు. వారు వచ్చిచూడగా, ఇంటిలోని రెండు బీరువాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై వీపీ త్రినాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఆభరణాలతో పాటు ఎల్ఈడీని కూడా దొంగలు అపహరించారు. ఆరు కాసుల బంగారం, సుమారు 3 కిలోల వెండి ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై ఆర్వీరెడ్డి తెలిపారు. గేటు తాళం పగులగొట్టి.. రంగంపేట : మండల కేంద్రమైన రంగంపేటలో కిరాణా వ్యాపారి గళ్లా శ్రీనివాసరావు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రూ.4.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. స్థానిక మెయిన్ రోడ్డు పక్కనే శ్రీనివాసరావు కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి చొరబడి, మెయిన్ ఇనుప గేటు తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. పడక గదిలోని బీరువా తెరిచి, అందులో పెట్టిన 43 కాసుల బంగారం, 35 తులాల వెండి వస్తువులు తస్కరించారు. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ.రాజశేఖరరావు, రంగంపేట ఏఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అలాగే శ్రీనివాసరావు ఇంటి పక్కనే ఉంటున్న కుసుమంచి రాజేష్ కిరాణా షాపులో కూడా టేబుల్ సొరుగులను దొంగలు పగులగొట్టారు. అందులో డబ్బు లేకపోవడంతో వెళ్లిపోయారు. సీఐ రాజశేఖరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు షాపునకు కన్నం.. నగలు చోరీ
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్లో ఓ బంగారు షాపులో దొంగతనం జరిగింది. బీఎన్ రెడ్డి నగర్లోని శ్రియ జ్యుయలరీ షాపు గోడకు దొంగలు కన్నం వేసి చోరీ చేశారు. షాపులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
కరీంనగర్లో ఆలయదొంగలు పట్టివేత
-
అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెంలోని గత అర్థరాత్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోకి చోరబడిన దుండగులు అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని ఈ రోజు తెల్లవారుజామున ఆలయ పూజారీ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన వివరాలను పోలీసులు పూజారీ నుంచి సేకరిస్తున్నారు. లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు చోరీ అయ్యాయని పూజరీ పోలీసులకు వివరించారు. -
గుత్తిలో రూ. 6 లక్షల బంగారు, వెండి నగలు దోపిడీ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రప్రియనగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ దాదాపు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.