Simhachalam temple scandal
-
అప్పన్న భూముల్లో ‘పచ్చ’ బాబులు
సర్వే నంబరు–161/1లోని 21.96 ఎకరాలను అప్పట్లో టీడీపీలో ఉన్న మండవ రవికుమార్ చౌదరి అనే వ్యక్తి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించాడు. ఈ స్థలంలో భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనేక మందికి విక్రయించారు. ఈ భూమి కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. ఈ సర్వే నంబరులోని భూమిని కూడా ఆలయ ఆస్తుల జాబితా నుంచి తప్పించారు. ఇది వేపగుంట గ్రామం సర్వే నంబరు–5లో సింహాచలం ఆలయానికి చెందిన భూమి. ఈ భూమిలో బొబ్బర నరసింహం అనే టీడీపీ నేత రెండెకరాల వరకు స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడున్న గెడ్డ పోరంబోకు భూమిని కూడా ఆక్రమించాడు. అలాగే, వేపగుంటలోని సర్వే నంబరు–1లోని ఒక ఎకరాన్ని టీడీపీ నేత గంట్ల పెంటారావు ఆక్రమించుకుని ఏకంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ స్థలం కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చాలా మంది టీడీపీ నేతలు సింహాచలం దేవస్థానం ఆస్తులను కొల్లగొట్టారు. అడవి వరంలో ఆలయానికి చెందిన భూమినే ఒక సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్నింటిని ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో టీడీపీ నేతల వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేటు వేసి పాగా.! సింహాచలం దేవస్థానానికి 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో 862.22 ఎకరాల భూమి ఆలయానికి చెందినది కాదంటూ.. దానిని తొలగించేందుకు అప్పటి ఈవో రామచంద్రమోహన్ ద్వారా 2016లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అనుగుణంగా 2016 మే 31న ఫలానా ఆస్తులు సింహాచలం ఆలయానికి చెందినవి అనే ఆధారాలు లేవంటూ.. వాటిని జాబితా నుంచి తొలగించాలని అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫైల్ పంపారు. అయితే.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు గానూ సరైన ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఆ అధికారి ఆ ఫైల్‌ను ఈవోకు తిప్పి పంపారు. ఏడాదైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. ఆ తరువాత కాలంలో ఇద్దరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లను ప్రభుత్వం ఎటువంటి కారణాలు లేకుండా బదిలీ చేసింది. ఆ తర్వాత 2017లో 862.22 ఎకరాలను తొలగిస్తూ ఆలయ భూముల జాబితాను ప్రచురించారు. వాస్తవానికి ఈ జాబితా ప్రకటన దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే జరగాలి. ఇక్కడ ఈ నిబంధన అమలు కాలేదు. కేవలం దేవదాయ శాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని పేర్కొంటూ 862.22 ఎకరాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానంగా టీడీపీ నేతలు ఈ భూములను ఆక్రమించేందుకు ఈ తతంగం మొత్తం నడిపారని దేవదాయ శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వానికి నివేదిక సింహాచలం ఆలయ భూముల వ్యవహారాలతో పాటు మాన్సాస్ ట్రస్టు భూముల అక్రమాలపై దేవదాయ శాఖ అధికారులు చేపట్టిన విచారణ నివేదికను గత నెల 16న ఆ శాఖ కమిషనర్‌కు సమర్పించారు. ప్రధానంగా ఆలయ ఆస్తులను కాజేసేందుకే తొలగింపు వ్యవహారం నడిచిందని.. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే ఆలయానికి చెందిన భూములు, ఆస్తులను లీజులకు ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భూములు ఎవరు ఆక్రమించారు, ఆలయ భూములను లీజుకు ఇవ్వడంలో నిబంధనలను ఎలా తొక్కిపట్టారు, ఎవరికి లీజుకు ఇచ్చారు, ఎవరి ఒత్తిడి ఉందనే కోణంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరింత మంది ‘పచ్చ దొంగలు’ బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
అప్పన్న భూములు 862.22 ఎకరాలు మాయం
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని తాజాగా గుర్తించినట్లు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శాఖాపరంగా నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూములు మాయం కావడం నిజమేనని అధికారులు కమిటీ తేల్చిందని, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారో తేలాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2017లో చోటు చేసుకున్న ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీ విచారణ జరిపి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించింది. ఆ నివేదికను జత చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుతోనే.. గత సర్కారు ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల భూముల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో భూములను తొలగించారు. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నంబర్లకు సంబంధించి ‘మీ భూమి’ పోర్టల్‌లో ఇప్పటికీ ఆలయ భూములు పేరుతో ఉన్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ సర్వే నెంబర్ల వివరాలను కమిటీ నివేదికలో వెల్లడించింది. కమిషనర్ అనుమతి లేకుండా తొలగింపు.. దేవదాయ శాఖ చట్ట నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 862.22 ఎకరాలను తొలగించినట్లు అధికారుల కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి అప్పటి ఆలయ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. 2016 సెప్టెంబరు 19, అక్టోబరు 4వతేదీన ఈ భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదిస్తే అప్పటి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మరో అధికారి 2017 ఏప్రిల్ 24వ తేదీన అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చారని కమిటీ నివేదికలో తెలిపింది. మరో 2144 ఎకరాలూ దేవుడి భూములే.. 862.22 ఎకరాల భూముల సంగతి అలా ఉంచితే మరో 2144.37 ఎకరాల సింహాచలం ఆలయ భూములు ఇప్పటికీ ఆలయ ఆస్తుల జాబితాలో చేరలేదని కమిటీ తేల్చింది. ఈ భూములకు సంబంధించి సింహాచలం ఆలయం పేరిట పట్టా తీసుకునే ప్రక్రియ రెవిన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లోనే ఉందని పేర్కొంది. టీడీపీ హయాంలో వీటిని సింహాచలం ఆలయం పేరిట నమోదుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ కార్యాలయం నుంచి పలుమార్లు ఆలయ అధికారులకు ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోలేదని వెల్లడించింది. సహకరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు.. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ప్రభుత్వానికి సూచించారు. అప్పటి ఆలయ ఈవో, నాటి విశాఖ అసిస్టెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
అప్పన్న భూముల బాగోతంపై విచారణ షురూ
సింహాచలం (పెందుర్తి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సింహాద్రి అప్పన్నస్వామి భూముల గోల్‌మాల్‌పై విశాఖలో విచారణ ప్రారంభమైంది. ఈ భూబాగోతంపై రాష్ట్ర దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ డి. భ్రమరాంబ, విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మంగళవారం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టి రికార్డులను పరిశీలించారు. నగరంలోని అడవివరం, చీమలాపల్లి, వేపగుంట ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రూ.10వేల కోట్లకు పైగా విలువచేసే 748.07 ఎకరాలను 2016లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం ఆస్తుల రికార్డుల నుంచి తొలగించింది. దేవాలయాల భూములు పరిరక్షణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు)లో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భూములు దేవస్థానానివి కావని, వేరే వారివంటూ 2016 డిసెంబరు 14న అధికారిక నోటిఫికేషన్ జారీచేశారు. ఈ బాగోతాన్ని గత నెల 27న సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, దేవదాయ శాఖ విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌తో తొలుత ఓ కమిటీని ఏర్పాటుచేశారు. అలాగే, 2016లో సింహాచలం దేవస్థానం అప్పటి ఈఓ, ప్రస్తుతం దేవదాయ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న కె. రామచంద్రమోహన్‌ను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో.. వారం రోజుల కిందట పుష్పవర్థన్ ప్రాథమికంగా కొంత విచారణ చేపట్టారు. తాజాగా, విచారణ కమిటీలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను కూడా సోమవారం నియమించారు. దీంతో సోమవారం సింహాచలం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళ నుంచి పలు రికార్డులు తీసుకుని పరిశీలించారు. పూర్తి విచారణ చేపట్టి నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని భ్రమరాంబ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు శాంతి, వినోద్‌కుమార్, అన్నపూర్ణ కూడా రికార్డులను తనిఖీలు చేశారు. -
‘రాజకీయ పెత్తనం ఎక్కువైంది.. మంచిది కాదు’
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా పెందుర్తి శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చందనోత్సవం సందర్బంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కానీ ఆలయంపై రాజకీయ పెత్తనం ఎక్కువ అయింది. ఇది మంచిది కాదు. వీఐపీ పాసులు పూర్తి జబర్దస్తీగా తీసుకోవటం, ఎవరిని బడితే వారిని రప్పించడంతో భక్తులకు ఆటంకం కలిగింది. ఈ ఘటన దేవాదాయ శాఖకు పెద్ద మచ్చ. అసలు ఆలయాలను భక్తులకు చేరువలో ఉండేలా చేయాలి గానీ రాజకీయ నాయకులు పెత్తనం చేయడం దారుణం. శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్నలు పేదల దేవుళ్లు.. అలాంటి దేవుళ్లను పేదలకే దూరం చేయడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా దేవాదాయ శాఖలో మార్పులు తీసుకురావాల’ని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. -
‘గూడు’కట్టుకున్న ఆశలు
అప్పన్న భూవివాద పరిష్కారానికి కసరత్తు 1998 నుంచి నేటి వరకు ధరల మార్పులపై ప్రభుత్వం ఆరా దేవస్థానం భూముల ధరలపై నివేదిక {పభుత్వానికి సమర్పించిన కలెక్టర్ గోపాలపట్నం : సింహాచల దేవస్థానం భూవివాద పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూముల ధరల నివేదిక కోరడంతో జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో దేవస్థానం భూ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేవస్థాన భూముల పరిధిలో ఉన్న వెంకటాపురం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, అడివివరం గ్రామాల్లో వేలాది ఇళ్లు, స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. 1999లో దేవస్థానం భూముల్లో నివాసాలుంటున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు నాటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందుకోసం 578 జీఓ విడుదల చేసింది. కానీ అప్పట్లో ఆ భూముల ధరలు భారంగా ఉన్నాయంటూ ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసి ధరలు మార్పు చేయాలని ఉద్యమాలు చేశారు. అదే సమయంలో దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ పీఠాధిపదులు రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏకంగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలు, గోపాలపట్నంతో పాటు నగరమంతటా ఉన్న కొండప్రాంతం సర్వే నంబరు 275 వివాదంలో ఉంది. ఈ భూములు కూడా దేవస్థానానివేనని, వీటి నిర్మాణాలను, క్రయ విక్రయాలను అధికారులు అడ్డుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఏటా పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతోంది. మరో వైపు సొంతిళ్లు ఉన్నా అవి తమ భూముల్లోనే ఉన్నాయని దేవస్థానం అధికారులు పెత్తనం చేస్తుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలల్లో దేవస్థానం భూ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దేవస్థానం భూముల ధర రికార్డు సమర్పించాలని కలెక్టర్ యువరాజ్ నుంచి గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు ఆదేశాలు వచ్చాయి. దీంతో 1998 నుంచి ఇప్పటి వరకు పెరిగిన భూముల ధరల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం కోరడంతో పీఠాధిపతులు సానుకూలంగా ఉన్నందున న్యాయస్థానం నుంచి ప్రజలకు అనుకూల తీర్పు వెలువడుతుందని... 578 జీవో ప్రకారమే ధరల నిర్ణయం ఉంటుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడున్న భూముల ధరలు గోపాలపట్నం మెయిన్‌రోడ్డు కమర్షియల్ చదరపు గజం రూ25 వేలు ...గోపాలపట్నాన్ని అనుకొని ఉన్న కాలనీల్లో చదరపు గజం రూ. 6 వేల నుంచి రూ.16వేలు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డు కమర్షియల్ రూ. 28వేలు, ఆనుకొని వున్న కాలనీల్లో చదరపుగజం రూ.12 వేల నుంచి రూ.16 వేలు వేపగుంట మెయిన్‌రోడ్డు చదరపు గజం రూ.12 వేలు... ఆనుకొని ఉన్న కాలనీల్లో రూ.5800 నుంచి రూ.12 వేలు వరకూ {పహ్లాదపురం ఏరియా రూ.11వేలు అడవివరం ఏరియా రూ.11వేలు పురుషోత్తపురం ఏరియా రూ.6 వేల నుంచి రూ.11 వేలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం దేవస్థానం భూ సమస్య పరిష్కారం కోసమే మేమూ ఎదురు చూస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి భూముల ధరలు నివేదించాం. భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇది జరిగితే ప్రజలకు మేలు జరగడంతో పాటు రిజిస్ట్రేషన్ల రూపేణా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక లక్ష్యాలూ నెరవేర్చగలం. - లక్ష్మీనారాయణ, సబ్‌రిజిస్ట్రార్, గోపాలపట్నం గడిచిన ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల తీరిదీ సంవత్సరం {పభుత్వ టార్గెట్ వచ్చింది 2009-2010 రూ.14 కోట్లు రూ.9.23 కోట్లు 2010-11 రూ.15.63 కోట్లు రూ.22.70 కోట్లు 2011-12 రూ.27.24 కోట్లు రూ.16.6 కోట్లు 2012-13 రూ.27.25 కోటు రూ.19.92 కోట్లు 2013-14 రూ.24.85 కోట్లు రూ.12.36 కోట్లు 2014-15 రూ27 కోట్లు రూ.10 కోట్లు(ఇప్పటి వరకు)