
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా పెందుర్తి శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చందనోత్సవం సందర్బంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కానీ ఆలయంపై రాజకీయ పెత్తనం ఎక్కువ అయింది. ఇది మంచిది కాదు. వీఐపీ పాసులు పూర్తి జబర్దస్తీగా తీసుకోవటం, ఎవరిని బడితే వారిని రప్పించడంతో భక్తులకు ఆటంకం కలిగింది. ఈ ఘటన దేవాదాయ శాఖకు పెద్ద మచ్చ. అసలు ఆలయాలను భక్తులకు చేరువలో ఉండేలా చేయాలి గానీ రాజకీయ నాయకులు పెత్తనం చేయడం దారుణం. శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్నలు పేదల దేవుళ్లు.. అలాంటి దేవుళ్లను పేదలకే దూరం చేయడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా దేవాదాయ శాఖలో మార్పులు తీసుకురావాల’ని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment