'అన్ని ఎన్నికలు ఒకేసారి'కి బీజేపీ ఓకే
న్యూఢిల్లీ: లోక్సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లేఖ రాశారని బీజేపీ సీనియర్ నాయకుడు బుధవారం చెప్పారు.
వివిధ రాజకీయ పార్టీల మధ్య దీనిపై పెద్దఎత్తున చర్చ జరగాలని అమిత్షా అందులో పేర్కొన్నారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈసీని కోరారు. దీన్ని కాంగ్రెస్, తృణమూల్ వ్యతిరేకిస్తున్నాయి. అన్నాడీఎంకే, అస్సాం గణ పరిషత్, శిరోమణి అకాలీ దళ్ సమర్థించాయి.