Sinare
-
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
‘సినారె’ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం
సాక్షి, అమరావతి : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించిన అనంతరం క్లుప్తంగా మాట్లాడారు. సినారె గురించి తాను ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సింది ఏమీలేదని, ఆయన రచనలు, ఆయన ప్రసంగాల గురించి ఇంతమంది పెద్దలు మాట్లాడిన తరువాత తానింక చెప్పజాలనని జగన్ వినమ్రంగా అన్నారు. ఆచార్య సినారె రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు ఆయన చేసిన ప్రసంగాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనది డాక్టర్ సి.నారాయణరెడ్డితో 45 ఏళ్ల పరిచయమని అన్నారు. ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాక్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రథమ శ్రోతను తానేనన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండోవారు సినారె అని చెప్పారు. యువకులైన సీఎం వైఎస్ జగన్ పది కాలాల పాటు రాజ్యం చేయాలని.. జనరంజకంగా పాలించాలని జస్టిస్ చలమేశ్వర్ ఆకాంక్షించారు. రైతులను వేధించకుండా చూడాలి ఒకచోట నుంచి మరోచోటికి రైతులు నల్లబంక మట్టిని, ఎర్రమట్టిని తవ్వుకుని ట్రాక్టర్లలో తీసుకువెళ్తూ ఉంటారని.. అలాంటి వారిని పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సమావేశంలో చలమేశ్వర్ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది శిక్షార్హమని ఎక్కడాలేదని.. రైతుల అనుకూల ప్రభుత్వం కనుక వారి సంక్షేమం కోరి ఇలాంటి వేధింపులు వారిపై లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలివ్వాలని, ఇది రాష్ట్రంలో ఉండే రైతులందరి సమస్య అని ఆయనన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారన్నారు. అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. వాటిని అధిగమించే శక్తి వైఎస్ జగన్‌కి ఉందని భావిస్తున్నానన్నారు. ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వస్తారని, ప్రజాసేవ చేసే క్రమంలో చట్టసభల్లో అనవసరంగా బలప్రదర్శనలు జరుగుతూ ఉంటాయన్నారు. ప్రజాసేవను ఇలా చేయాలా? ఇంత వేడి అవసరమా అని అన్నారు. సినారె అనేక విషయాలను చక్కగా చెప్పారన్నారు. జగన్ ఆత్మవిశ్వాసం గొప్పది : యార్లగడ్డ పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను.. సంఘటనలను చెప్పిన డాక్టర్ సి.నా.రే ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ పూర్వ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్, ఫలితాలకు మధ్య సమయంలో తాను జగన్‌ను కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరినపుడు, ఫలితాలు రావడానికి ముందే.. తాను 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అదే హోదాలో ఆవిష్కరిస్తానని చెప్పారని, ఆయన ఆత్మవిశ్వాసం అంత గొప్పదని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. రైతు నేస్తం పబ్లికేషన్స్‌కి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. సినారె కుటుంబ సభ్యులు ఎ. భాస్కర్‌రెడ్డి, ఎస్ సురేందర్‌రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్‌రెడ్డి, గాదె సుధాకర్‌రెడ్డి, చైతన్యదేవ్, ప్రముఖులు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేష్, కోనేరు ప్రసాద్, అడుసుమిల్లి జయప్రకాష్, గోళ్ల నారాయణరావు, వంశీ రామరాజు, కేవీ సుబ్బారావు, ఏఎస్ దాస్, విజయసాయిరెడ్డి, కనుమూరి రఘురామ కృష్ణంరాజు సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ
-
‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : సాక్షి, తాడేపల్లి: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి పార్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఒకే వాక్యంలో చెప్పాలంటే సినారె ప్రసంగాల పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. సభాధ్యక్షులుగా పాల్గొన్న సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనకు డాక్టర్ సి.నారాయణ రెడ్డితో 45 ఏళ్ల పరిచయమని, ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాకింగ్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రధమ శ్రోతను తానే అని అన్నారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండో వారు సినారె అని గుర్తు చేశారు. ముఖ్య అతిథి జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారని, అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని అన్నారు. వాటిని అధిగమించే శక్తి సీఎం జగన్‌కు ఉందని భావిస్తున్నానన్నారు. పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను సంఘటనలను చెప్పిన డాక్టర్ సినారె ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి రైతు నేస్తం పబ్లికేషన్స్ అధిపతి యడవల్లి వేంకటేశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారు. -
సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతి
సిరిసిల్ల: సిరిసిల్లతో అనుబంధం మధురానుభూతిని కలిగించిందని పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఎనిమిది రోజులుగా వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో సినారె సాహితీ ప్రాభవం పేరుతో సినారె సాహిత్యపై ప్రసంగాలు జరిగాయి. గురువారం రాత్రి జరిగిన వేడుకల్లో నారాయణరెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో సాహితీ మిత్రులు, చిన్ననాటి చదువుకున్న సంగతులను గుర్తుచేశారు. సిరిసిల్లకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగం సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ సినారె సాహిత్య సృజన కావ్యంగా సాగిందన్నారు. అనుసృజనను కూడా అంతే విలక్షణంగా చేశారని వివరించారు. ఈ సందర్భంగా సినారె మోహన్‌కు జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కళా వెంకటదీక్షితులు, వంశీ రామరాజు, రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
పరిమళాల పూబోణి... కృష్ణవేణి
ప్రతి సభలో ‘నా పాటల తండ్రి సినారె’ అంటూ నువ్వు సభికులతో చప్పట్లు కొట్టించుకుంటావు. నిజానికి సినారె నా తండ్రి - అంది సినారె పాట.‘మూడు వేల పాటల్లో నీవెవరు సోదరీ’ అన్నాను. ‘‘ఈ వరుసలేంటి’’అంది. ‘‘మనం ఇద్దరం సినారెని తండ్రి అంటాం. కనుక నాకు నీవు సోదరివే, చెప్పక్కా.’’ నేను శిఖరమస్తకుడు అని సినారెతో పిలిపించుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు, అభినేత్రి వాణిశ్రీ నటించి రామకృష్ణ - సుశీల ఆలపించిన కృష్ణవేణిని అంది.సంగీతం విజయభాస్కర్. దర్శకుడు అద్భుత దార్శనిక దర్శకుడు వి.మధుసూదన్‌రావు. కథ చెబుతూ పెళ్లయ్యాక కృష్ణానదీ పరివాహక ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీ పర్వతం - నాగార్జున సాగర్ నుండి సముద్రంలో సంగమించే హంసలదీవి దాకా పాటను నడిపించాలని చెప్పి తయారించిన బాణిని సినారె ముందుంచారు.సినీరంగంలోకి రాకమునుపే ‘కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు’ నాగార్జున సాగర కావ్యంలో పలికించిన నా పాటల తండ్రిలోని కవితా పారిజాత హృదయం చిరునవ్వు నవ్వుకుంది తెలుగు మల్లెపూవులా. రావాల్సిన పాటే వచ్చిందే అని... ‘‘నాయిక చూపు నది వైపుగా నాయకుని చూపు తనదిగా (పెళ్లయింది కనుక) మారిన నాయిక వైపుగా ఇలా నాయకానాయిక హృదయాల్లోకి దూకు తండ్రీ’’ అన్నాను. నా తండ్రి సినారెతో - ఇచ్చిన బాణీ దారి చూపుతుంటే పలికాడు సినారె... ఆమె పల్లవిగా ‘‘కృష్ణవేణీ... తెలుగింటి విరబోణీ’ అతడేమనాలో క్షణంలో వెయ్యోవంతు ఆలస్యం లేకుండా ‘‘కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ’’ అంటుండగా - చిన్నారి చిరు పల్లవి వచ్చేసింది. పాట ప్రారంభమయ్యేది శ్రీ పర్వతం నుండి కదా ‘‘శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు’’ నిజానికి నాగార్జున సాగరంలో విద్యుత్తు కూడా పుడుతుంది. నాయికతో విద్యుల్లతలు అనిపించాను కనుక నాయకునితో ఏమనిపించాలనుకున్నారు. సినారె కళ్లలో దయ - ఒళ్లంత లయ తొణికిసలాడుతుంది. ఏళ్లుఏళ్లుగా... మనసు వెన్నపూస - మాటలో ప్రాస - తనది. అందుకే పైన విద్యుల్లతకు అనుబంధంగా ‘లావణ్యలతవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగిస్తావనిపించాడు.’’ నాగార్జున గిరి కౌగిట ఆగి - నీళ్లను బంగారు చేలుగా మార్చేవు అనిపించాడు. నాయికది ‘వస్తువుపైన ఆలోచన కనుక బంగారు చేలు అన్నది కాబట్టి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని (జీవితాంతం ఆరిపోని) వలపులు పండించమనిపించాడు. కృష్ణానదితో పాటు - వెళుతుంది సినారె కలం... అమరావతిలో రాళ్లను అందాల రమణులుగా తీర్చిదిద్దేవంటే ఏ శిల్పరమణులకు - ఏ దివ్యలలనులకు నోచని అందాలు దాచిన కృష్ణవేణి - అని/ ఆ తర్వాత చరణంలో... అభిసారిక అంటే ప్రియుని కోసం వెతుక్కుంటూ వెళ్లే నాయిక. ఇక్కడ నది కూడా సముద్రం కోసం వెళుతూ ఉంటుంది కనుక వాణిశ్రీ నోట ‘అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయంతో సంగమించావంటే, కృష్ణంరాజుతో కొసమెరుపుగా నా మేని సగమై - నా ప్రాణ సుధవై సుధ అని ఎందుకనాలి సుధ అంటే సలిల సంబంధి అమృతం బతికించేది గనుక నిఖలము నీవై నిలిచిన కృష్ణవేణి అంటూ నదిని, పాటని అంటూ సాగరానికి - ఇటు ప్రేక్షకుల హృదయ సాగరాలకు చేర్చుతాడు సినారే. ఒక్కోపాట రాయడానికి పరిసరాలు - హృదయ పరిమళాలు కూడా తెలిసుండాలని ఆ రెంటిని కలిపే చతురతా ప్రాభవాలు కవి కలిగుండాలని పాట ద్వారా చూపిన నా తండ్రికి ఇటీవలే ‘కేంద్ర సాహిత్య ఫెలో’ అవార్డు వచ్చింది తెలుసా తేజా అంటూ సాయం సంధ్యవేళ నా తండ్రి రవీంద్రభారతికి వచ్చుంటాడు. వస్తా... అంటూ పరిమళాల నెవడాపునంటూ మా ఉప్పల్ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా సాగిపోయింది కృష్ణవేణిలోని కృష్ణవేణి పాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత