సింధు తండ్రి ప్రత్యేక పూజలు
పెదవేగి: రియో ఒలంపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని శ్రీ రత్నాలమ్మ ఆలయంలో శుక్రవారం ఆయన పూజలు చేశారు. సింధు బంగారు పతకం గెలిచి దేశ ఖ్యాతిని పెంచుతుందనే నమ్మకం తనకుందని రమణ తెలిపారు. ఇక్కడ కుల దేవతను పూజలు చేయడం ఆచారంగా వస్తోందన్నారు.
మరో వైపు సింధు బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఈరోజు పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో పలువురు పూజలు చేశారు. అలాగే, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్‌గౌడ్..108 కిలోల పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు.