మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్‌గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్‌గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్‌కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.