‘అభివద్ధి సూర్యుడు’ సీడీ విడుదల
బిజినేపల్లి : తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులు విజయకాంత్, శ్రీశైలం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి ‘అభివద్ధి సూర్యుడు’ సీడీని శనివారం పాలెం గ్రామంలో విడుదల చేశారు. రేలారే రేలా జానపద కవి గాయకుడు శివనాగులు రచించిన పాట స్వరకల్పనలో ఈ సీడీని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
సర్పంచ్ పుప్పాల సుమలత, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఈఓ బ్రహ్మచారి ఆధ్వర్యంలో సీడీని విడుదల చేశారు. నాలుగు కోట్ల అభిమానులే నీ ఆయుధం అనే ట్యాగ్‌లైన్‌పై మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సీడీని రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో కాశిదాసు, శ్రావణ్‌కుమార్, డప్పు లక్ష్మణ్, బత్తుల వెంకటేష్, గ్రామస్తులు రాము, శ్రీనివాస్, నాగన్న, సత్యయ్య ఉన్నారు.