సింగర్ గురూ!
వెంకటేశ్ కూడా సింగింగ్ క్లబ్లో చేరిపోయారు గురూ! ఈ మధ్య స్టార్ హీరోలు తమంతట తాముగానో, లేక సంగీతదర్శకుడు, దర్శకుడు కోరిన మీదటో పాటలు పాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గురు’ సినిమా కోసం వెంకీ కూడా పాడారు. చిత్ర దర్శకురాలు సుధ కొంగర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కోరిన మీదట ఆయన ఉత్సాహంగా పాడేశారు. ఈ సినిమాలో వెంకీ లుక్ అభిమానులకు ఓ ఐ–ఫీస్ట్ అయితే, ఆయన పాడటం ఇయర్–ఫీస్ట్. మొత్తానికి ఈ సినిమా మంచి ఫీస్ట్ అవుతుందని చిత్రబృందం అంటోంది. హిందీ చిత్రం ‘సాలా ఖదూస్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జనవరిలో సినిమా విడుదల కానుంది.