జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కన్నుమూత
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సతీమణి స్వర్ణలతా రెడ్డి సైదాబాద్ కార్పోరేటర్‌గా పని చేస్తున్నారు.