single window clearance
-
బడ్జెట్ 2019 : సినిమాలకు సింగిల్ విండో అనుమతులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు. మన సినిమాలకు సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశీ చిత్రాలకు మాత్రమే అమల్లో ఉన్న ఈ పద్ధతిని ఇక పై స్వదేశీ చిత్రాలకు కూడా అనుసరించనున్నట్టుగా తెలిపారు. సినిమా టికెట్లపై జీఎస్టీని కూడా 12 శాతానికి తగ్గిస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సినీరంగాన్నిపట్టి పీడిస్తున్న పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్‌ను సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఉరీ చిత్రంపై ప్రశంసలు కురింపిచారు. -
స్టార్టప్స్‌కు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే అవసరం
యువ పారిశ్రామికవేత్తలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం కింద స్టార్టప్స్‌కు 1-3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ప్రకటించాలని యువ పారిశ్రామికవేత్తలు కోరారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ ఆవశ్యకమని తెలిపారు. భారత్ మెల్లగా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందన్నారు. స్టార్టప్స్‌కు ప్రాధాన్యమివ్వడం వల్ల దేశీ పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ, టైర్-2, టైర్-3 పట్టణాలు స్వయం సమృద్ధి దిశగా పయనించాలంటే, వాటిని చేయూత అవసరమని తెలిపారు. ఆరోగ్య సంబంధిత సేవల్ని అందించే మెడికోవ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీవల ్సమ్ మీనన్ మాట్లాడుతూ.. స్టార్టప్ ఇండియా కార్యక్రమ ప్రారంభం వల్ల దేశంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుందని, స్టార్టప్ అనుకూల పరిస్థితుల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగం, హెల్త్‌కేర్ బిజినెస్, సామాజిక-ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు, గ్రామీణ ఉపాధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రభుత్వం నిబంధనలు అమలయ్యే అన్ని రంగాలు ప్రయోజనం పొందుతాయని 360రైడ్ వ్యవస్థాపకుడు, సీఈవో లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత కంపెనీల ఏర్పాటు ట్రెండ్ నడుస్తోందని ఫన్టూట్ సీఈవో రాజీవ్ పథక్ తెలిపారు. ప్రధాని మోదీ జనవరి 16న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
విశాఖలో చిత్ర పరిశ్రమకు వెంటనే క్లియరెన్సులు
మంత్రులు అయ్యన్న, గంటా వెల్లడి విశాఖపట్నం: విశాఖలో చిత్రపరిశ్రమ ఏర్పాటుకు సింగిల్‌విండో క్లియరెన్సులు ఇస్తామని ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చెప్పారు. ‘మేముసైతం’ కార్యక్రమ నిర్వహణలో భాగం గా బుధవారం విశాఖలోని రామానాయుడు స్టూడియోలో వారు మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖ పునర్నిర్మాణానికి సినీ తారలంతా మేము సైతం అంటూ ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మేము సైతం కార్యక్రమంలో పలు వినోద కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. రాష్ట్రంలో గతంలో కూడా విపత్తుల సమయంలో చిత్రపరిశ్రమ ఆదుకుందని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖను ఆదుకునేందుకు చిత్రపరిశ్రమ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని హీరో వెంకటేశ్‌తెలిపారు. సమావేశంలో హీరోయిన్ శ్రీయ తదితరులు పాల్గొన్నారు.