కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు. మన సినిమాలకు సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశీ చిత్రాలకు మాత్రమే అమల్లో ఉన్న ఈ పద్ధతిని ఇక పై స్వదేశీ చిత్రాలకు కూడా అనుసరించనున్నట్టుగా తెలిపారు. సినిమా టికెట్లపై జీఎస్టీని కూడా 12 శాతానికి తగ్గిస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సినీరంగాన్నిపట్టి పీడిస్తున్న పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్‌ను సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఉరీ చిత్రంపై ప్రశంసలు కురింపిచారు.
Comments
Please login to add a commentAdd a comment