single women pension
-
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
వితంతు, ఒంటరి మహిళల పింఛన్ నిబంధనల మార్పు
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల నిర్వచనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హత నిబంధనలను మార్పుచేశారు. దీని ప్రకారం.. - వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. - పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది. ఈ కేటగిరీ–2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్‌కు అర్హులైనా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. - అలాగే, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. - కుటుంబ పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్ ఇస్తారు. కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్ పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
టీడీపీ నేత చేతికి వితంతు పింఛన్
విశాఖపట్నం, దేవరాపల్లి(మాడుగుల): ఓ వితంతువుకు చెందిన పింఛన్‌ను రెండేళ్లుగా టీడీపీ నేత ఒకరు పొందుతున్నారు. ఈవ్యవహారాన్ని ఎ.కొత్తపల్లి వైఎస్సార్సీపీ నేతలు బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తాటికొండ దేముడమ్మ భర్త అచ్చిబాబు సుమారు రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తన భర్త పింఛన్‌ను తనకు వితంతువు పింఛన్‌గా మార్పు చేయాలని జన్మభూమి సమావేశాల్లో పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. అయితే దరఖాస్తు చేసిన ప్రతిసారీ పింఛన్ తప్పక వస్తుందని చెప్పడంతో ఆశగా ఎదురు చూసి, చివరకు నిరాశకు గురికావడం పరిపాటిగా మారిపోయింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా దేముడమ్మకు పింఛన్ ఎందుకు మంజూరు కాలేదని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు చింతల సత్య వెంకటరమణ ఎంపీడీవో కార్యాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దేముడమ్మ రేషన్ కార్డు నంబరుపై స్థానిక దేశం నాయకుడు గంటా నర్సిబాబు రెండు సంవత్సరాలుగా పింఛన్ పొందుతున్నట్టుగా గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా, ఈ పింఛన్ సదరు వ్యక్తికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఎ.కొత్తపల్లిలో ఆదివారం జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మళ్లీ పింఛన్ పొందేందుకు దేశం నేత గంటా నర్సిబాబు ప్రయత్నించడంతో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుతగిలి, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో అక్కడికి చేరుకుని నర్సిబాబుకు పింఛన్ ఇవ్వవద్దని స్థానిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తాను వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలిని కావడంతో కావాలనే తన పింఛన్ నగదును రెండేళ్లు తనకు చెందకుండా కాజేశారని బాధితురాలు దేముడమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఎంపీడీవోను వివరణ కోరగా సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని, కార్డు నంబర్ మార్పు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశామని చెప్పారు. -
మూన్నాళ్ల ముచ్చటే..!
సాక్షి కడప : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఆలోచించి నిర్ణయం తీసుకుని...అందుకు అనుగుణంగా ప్రచారాలు.. అనంతరం ఒంటరి మహిళల పింఛన్‌కు శ్రీకారం చుట్టారు. కేవలం ఒకటి, రెండు నెలల్లోనే నిర్ణయాలు మారాయో... సాకులు వెతికారో తెలియదుగానీ వయస్సు పేరుతో వీటికి ఎసరు పెట్టారు.ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రభుత్వం పింఛన్లు అందించాలని నిర్ణయిం చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వీటిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మహిళామణుల్లో అలజడి రేపుతోంది. లేనిపోని ఆశలు కల్పించి... వెంటనే రద్దు చేయడంపై మండిపడుతున్నారు. ఏదీ ఓదార్పు ఒంటరి మహిళలకు పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం అంతలోనే రద్దు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పైగా తనకంటూ ఎవరూ లేని...ఆసరా దొరకని మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఓదార్పు ఇవ్వకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం చివరకు రద్దు నిర్ణయం చూస్తే వారికిచ్చే ప్రత్యేక గుర్తింపు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. 35 ఏళ్లు లేవని సాకు చూపి జులై నెలలో ఒంటరి మహిళలకు పింఛన్ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం..సెప్టెంబరులో 35 ఏళ్లు లేవని సాకు చూపుతూ పింఛన్లను ఏరి వేస్తోంది. ఇప్పటికే ఒకప్రక్క భర్తతోపాటు కుటుంబ సభ్యులకు దూరమై ఒంటరితనంతో నరకయాతన అనుభవిస్తున్న మహిళలకు అంతో ఇంతో పింఛన్ రూపంలో అందించే సొమ్మును కూడా వయస్సు సాకుచూపి తొలగిస్తున్నారు. 35 ఏళ్లలోపు మహిళలు అనాథలుగా ఉండకూడదా...ఆసరా లేని వారు ఉండరా...కనీసం కొంతైనా ఆలోచన చేయకుండా ప్రభుత్వం దుశ్చర్యకు నడుం బిగించిందని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో 75 పింఛన్లకు ఎసరు జిల్లాలో ఒంటరి మహిళలకు సంబంధించి సుమారు 866 పింఛన్లు ఉండగా, అందులో సుమారు 75కు పైగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పింఛన్ అందించి సెప్టెంబరు నెలకు వచ్చేసరికి రద్దు చేశారు. దీంతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఎవరు ఇవ్వమన్నారు....ఎందుకు తీసేశారంటూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ఇప్పటికే పింఛన్లను రద్దు చేస్తూ ఎంపీడీఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సెప్టెంబరులో డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వ తీరుపై బాధిత ఒంటరి మహిళలు మండిపడుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకుంటాం! జిల్లాలోని తహసీల్దార్ల నుంచి ఒంటరి మహిళల జాబితా వచ్చింది. అప్పట్లో అప్లోడ్ చేయడంతో అందరికీ మంజూరయ్యాయి. నిబంధనల మేరకు 35 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే పింఛన్ పొందడానికి అర్హులు. దీంతో 35 సంవత్సరాలలోపు ఉన్న వారిని తొలగించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాం.– రామచంద్రారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ నా పేరు బాల సుబ్బన్న గారి రమాదేవి.మాది కలసపాడు.పదేళ్ల కిందట మైదుకూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. నాకు ఇద్దరు పిల్లలు. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం పుట్టింటిలో ఉంటున్నాను. ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తామంటే దరఖాస్తు చేసుకున్నాను. 2018 జులైలో పింఛన్ మంజూరైంది. రెండు నెలలలు ఇచ్చారు.తర్వాత నిలిపివేశారు. అడిగితే 35ఏళ్ల లోపు ఉన్న వారికి రాదంటున్నారు. ప్రభుత్వం వయస్సువిషయంలో ఆలోచించాలి. -
అంగన్వాడీ, ఆశాలు అనర్హులు
‘ఒంటరి మహిళ భృతి’ సందేహాలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థిక భృతిని పొందేందుకు అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీక రణ, పరిశీలన సందర్భంగా వ్యక్తమవుతున్న సందేహాలకు సెర్ప్ అధికారులు స్పష్టత ఇచ్చారు. వీరందరికీ వార్షికాదాయం నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, గతంలో జారీచేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నం 17) మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు (హోంగార్డులు సహా) ఆర్థిక భృతిని పొందేందుకు అర్హులు కారని పేర్కొన్నారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఒంటరి మహిళలుగా ఆర్థిక భృతిని పొందేందుకు అనర్హులని, తక్కువ వేతనంతో పనిచేస్తున్న సీనియర్ మేట్లు మాత్రమే అర్హులని తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ.. తదితర (గౌరవ వేతనం పొందుతున్న) ప్రజాప్రతి నిధులు అర్హులు కారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన పిల్లలున్న మహిళల కుటుంబ ఆదాయం పరిమితికి లోపు ఉన్నట్లయితే ఆర్థిక భృతి పొందేందుకు అర్హులే. అభయ హస్తం పింఛన్ పొందుతున్న ఒంటరి మహిళలు, దాన్ని కాదనుకుని ఆర్థిక భృతి పొందే విషయంలో మాత్రం సెర్ప్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.