singreni
-
సింగరేణి పార్క్ వద్ద కొండచిలువ హల్చల్
సాక్షి, చెన్నూర్(మంచిర్యాల) : ఏరియాలోని కోల్‌బెల్ట్ రహదారి పక్కనే ఉన్న సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద గురువారం సాయంత్రం కొండచిలువ హల్చల్ చేసింది. పార్క్ నుంచి బయటకు వచ్చిన ఆరడుగుల పొడువు గల కొండచిలువ వర్క్‌షాపు మూలమలుపు వద్ద రోడ్డుపైకి రావడంతో రాకపోకలు సాగించే వారు భయంతో ఆగిపోయారు. వాహనాల లైటింగ్‌కు తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోయింది. కొండచిలువ తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోవడంతో పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రోజు సాయంత్రం సమయంలో వందలాది మంది కాలక్షేపానికి పార్క్‌కు వెళతారు. అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని కోరుతున్నారు. -
ఐఎన్టీయూసీని ఆదరించాలి
వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు ఆర్కే 5గనిపై గేట్ మీటింగ్ శ్రీరాంపూర్ : వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని ఆదరించాలని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన ఆర్కే 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలోనే కార్మికులకు 40 హక్కులు సాధించామని అన్నారు. ఆ తర్వాత గెలిచిన సంఘాలన్నీ కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు. టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని, వారి అసమర్థత వల్ల నేడు ప్రైవేటీకరణ పెరిగిందని పేర్కొన్నారు. గనులు కూడా ప్రైవేటు పరం కాబోతున్నాయని ఆరోపించారు. 9వ వేజ్‌బోర్డులో కార్మికులకు మెరుగైన జీతాలు అందించడానికి జాతీయ సంఘాలు కృషి చేశాయని, 10వ వేజ్‌బోర్డులో కూడా మెరుగైన వేతనాల కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలని, స్వంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని తెలిపారు. సమావేశంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డి.అన్నయ్య, బ్రాంచి ఉపాధ్యక్షులు జి.మహిపాల్‌రెడ్డి, అద్దు శ్రీనివాస్, అశోక్, బోనగిరి కిషన్, ఫిట్ సెక్రెటరీ ఆనందం, నాయకులు గంగయ్య, రమేశ్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
పరిహారం మాత్రమే చెల్లిస్తాం
పునరావాస ప్యాకేజీ మా పరిధిలో లేదు సింగరేణి డైరెక్టర్ అంటోనిరాజా లింగాపూర్ (రామగుండం) : మేడిపల్లి ఓపెన్‌కాస్టు బాధిత గ్రామమైన లింగాపూర్ ఎస్సీ కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలనే డిమాండ్‌పై సింగరేణి యాజమాన్యం గోదావరిఖని జీఎం కార్యాలయంలో కాలనీవాసులతో శనివారం సంప్రదింపులు జరిపింది. అంతకు ఒక రోజు ముందే సింగరేణి ఉన్నతాధికారులు ఎవ్వరికీ సమాచారమివ్వకుండా ఎస్సీ కాలనీ స్థితిగతులను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాతే కాలనీవాసులతో సంప్రదింపులకు అవకాశమిచ్చారు. రాబోయే రెండేళ్లలో మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కాలపరిమితి ముగియనుందని, ఎస్సీ కాలనీవాసులకు పునరావాస ప్యాకేజీ వర్తింపజేయడం సాధ్యం కాదని తేల్చేశారు. మూడు నెలల క్రితం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు కాలనీని సర్వేయర్ల బృందంతో పరిశీలించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో తమకు న్యాయం జరుగనుందని సంతోషపడ్డామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. వివిధ రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నప్పటికీ ఎస్సీ కాలనీవాసులకు పరిహారాలు మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ఏదేమైనా తాము శిథిలావస్థకు చేరిన గృహాలకు మాత్రమే పరిహారం చెల్లించనున్నామని, అంతకు మించి ఇతర అంశాలు తమ పరిధిలో లేవని, దీనికి కాలనీవాసులు సమష్టిగా నిర్ణయించుకుంటే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని, లేదంటే మీ నిర్ణయం మీదే అంటూ సమావేశాన్ని ముగించినట్లు ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్(పా) అంటోనిరాజా, సీజీఎం వెంకటేశ్వర్రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు, కన్నూరి సతీశ్‌కుమార్, ఇరికిళ్ల నర్సయ్య, కాసర్ల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.